English | Telugu

Karthika Deepam2 : కన్నతండ్రిని అక్కడ చూసి షాకైన కొడుకు.. ఆ పెళ్ళికి అడ్డంకేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -157 లో.....స్వప్న కాశీ ప్రేమ కోసం చెయ్ కోసుకోవడంతో శ్రీధర్ హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. డాక్టర్ చూసి ప్రమాదమేమీ లేదని చెప్తాడు. అప్పుడే కావేరి ఫోన్ చేస్తే మాట్లాడుతు.. శ్రీధర్ బయటకు వెళ్తాడు. అప్పుడే కార్తీక్ కూడా హాస్పిటల్ కి చెకప్ కోసం వస్తాడు. తనని చూసి శ్రీధర్ టెన్షన్ పడుతాడు. స్వప్నని చూడడానికి దీప అదే హాస్పిటల్ కి వస్తుంది. నువ్వు ఇలా ఎందుకు స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళావంటూ కాశీపై దీప కోప్పడుతుంది. అలాగే‌ కార్తీక్ కి దీప ఎదరుపడుతుంది.

ఏంటి నేను ఒక్కడినే హాస్పిటల్ కి వెళ్తానని చెప్పా కదా ఎందుకు వచ్చారని దీపతో కార్తిక్ అనగానే.. నేను మీ కోసం రాలేదు.. మీ చెల్లి స్వప్న కోసం వచ్చానంటూ జరిగింది మొత్తం చెప్తుంది. ఈ కాశీగాడు అసలు ఎందుకిలా చేస్తున్నాడని కార్తీక్ అంటాడు
మీరు కాశీనేం అనకండి.‌ నేను ఇందాక ఇలాగే కోప్పడ్డానని దీప అంటుంది. పదండి వెళ్లి చూద్దామని దీప అనగానే.. మా నాన్న ఉంటాడు కదా అని కార్తీక్ అంటాడు. తను ఇప్పుడే రాడని కార్తీక్ ని స్వప్న దగ్గరికి పంపిస్తుంది దీప. ఆ తర్వాత కాశీకి ఫోన్ చేసి శ్రీధర్ దగ్గరికి వెళ్ళు.. నేను చెప్పే వరకు అతనితో మాట్లాడుతూనే ఉండమని దీప అంటుంది. స్వప్న దగ్గరికి కార్తిక్ వెళ్లి.. ఎందుకిలా చేసావంటూ కోప్పడతాడు. మరొకవైపు శ్రీధర్ దగ్గరికి కాశీ వెళ్తాడు. నా కూతురిని వదిలేయ్ అంటు కాశీని శ్రీధర్ తిడుతాడు.. ఆ తర్వాత కార్తీక్ , దీప బయటకు వస్తారు. దీప సైగ చెయ్యగానే.. శ్రీధర్ దగ్గర నుండి కాశీ వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత స్వప్న దగ్గరికి శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ తో కోపంగా మాట్లాడుతుంది స్వప్న. మీరు టెన్షన్ పడకండి కార్తీక్ బాబు.. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు.. ఈ ప్రాబ్లమ్ ని నేనే సాల్వ్ చేస్తానని దీప అంటుంది. మరొకవైపు ఎల్లుండి నీకు పెళ్లి చేస్తున్నాను.. పెళ్లి అయ్యాక అమెరికా వెళ్ళమని స్వప్నకి శ్రీధర్ చెప్తాడు. అలా కాదని వాడు హీరోలాగా మళ్ళీ వస్తే వాడి సంగతి చెప్తానని స్వప్నకి శ్రీధర్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత కాంచన, కార్తీక్ లు భోజనం చేస్తుంటే.. అప్పుడే శ్రీధర్ వస్తాడు. మీరు చాలా మారిపోయారని కాంచన అంటుంది. శ్రీధర్ చిరాకుగా లోపలికి వెళ్తాడు. కాంచన బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...