English | Telugu

ప్రేరణకి నాగార్జున వార్నింగ్..  నువ్వేదో పుడింగిలాగా అంటున్నావ్!

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. వీకెండ్ రానే వచ్చింది. నాగార్జున ఎంట్రీలోనే సీరియస్ గా కన్పించడంతో హౌస్ మేట్స్ కి టెన్షన్ మొదలైంది. ఇక రాగానే ప్రేరణ గురించి మొదలెట్టాడు నాగార్జున. (Bigg Boss 8 Telugu)

నువ్వు ఏమైనా పెద్ద పుడింగివా అని ప్రేరణని అనగానే.. సర్ నేను రాంగ్ ఇంటెన్షన్ తో అన్లేదని ప్రేరణ వివరణ ఇస్తుంది. నయని నిల్చొని తనెప్పుడు అలాగే డిస్ రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడుతుంటుంది. ఒక్క నాతోనే కాదు సర్ దాదాపు అందరితో అలాగే ఉంటుంది. ఒక్క అటిట్యూడ్ చూపిస్తుందని నయని అంటుంది. నేనేం అలా రూడ్ గా అన్లేదని ప్రేరణ అనగానే నాగార్జున వీడియో ప్లే చేసి చూపిస్తాడు. అందులో ప్రేరణతో నయని నామినేషన్ గురించి మాట్లాడుతుంటే.. నువ్వేదో పుడింగిలాగా అంటున్నావని ఒక రకమైన సర్కాయిజం లాగా ఉంటుంది. ఆ తర్వాత ఆ వీడియో ప్లే చేసాక ప్రేరణ బిహేవియర్ ఎలా ఉందంటూ అటు హౌస్ మేట్స్ ఒపీనియన్.. ఇటు స్టూడియోలోని ఆడియన్స్ ఒపీనియన్ అడగ్గానే.. అందరు అది సర్కాయిజంలాగా ఉందని అంటారు. ఒక విష్ణుప్రియ మాత్రం డిస్ రెస్పెక్ట్ ఫుల్ అని అంటుంది.

దానితో పాటు పానిపట్టు యుద్ధం టాస్క్ లో నిఖిల్ విషయంలో ప్రేరణ ఎఫ్ అనే వర్డ్ యూజ్ చేసినందుకు నాగార్జున తనపై సీరియస్ అయ్యాడు. ఒకసారి పృథ్వీ అలా యూజ్ చేస్తే రీపీట్ అవ్వకూడదని చెప్పాను. ఇంతవరకు అలా పృథ్వి చెయ్యలేదు. ఒకరికి చెప్తే అది అందరూ ఫాలో అవ్వాలి.‌ఈ షోని పబ్లిక్ వాచ్ చేస్తారు. ఇంకొకసారి అలా యూజ్ చెయ్యకంటూ ప్రేరణకి నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో ప్రేరణ ఎమోషనల్ అవుతుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.