English | Telugu

ఉత్కంఠభరితంగా సాగిన టాస్క్.. ఎవిక్షన్ షీల్డ్ నబీల్ కే!

బిగ్ బాస్ సీజన్-8 లో శుక్రవారం రోజు జరిగిన ఏవిక్షన్ శీల్డ్ టాస్క్ లో స్నేక్ నోట్లో అందరికి సంబంధించిన ఎగ్స్ వేస్తారు. కానీ యశ్మీ, తేజ ఇద్దరు ఏకాభిప్రాయానికి రాకుండానే.. నిఖిల్ కి సంబంధించిన ఎగ్ ని స్నేక్ నోట్లో వేస్తాడు తేజ. దాంతో కోపంగా రోహిణి ఎగ్ ని స్నేక్ నోట్లో వేస్తుంది యష్మీ. ఇక మిగిలింది నబీల్.. కానీ తేజ రూల్స్ ని అతిక్రమించినందున అతనికి నాగార్జున పనిష్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ వీక్ మొత్తం మెగా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పాడు. ఇక చేసింది తప్పు అని నేనే ఒప్పుకున్న సర్ పనిష్మెంట్ తీసుకుంటున్నా సర్ అని తేజ చెప్తాడు. (Bigg Boss 8 Telugu)

ఆ తర్వాత నబీల్, రోహిణి, నిఖిల్ లు ముగ్గురిని లైన్ లొ నిల్చోమని మిగతా హౌస్ మేట్స్ అందరిని రీజన్స్ చెప్పమంటాడు నాగ్ మామ. మీరు ఎవరైతే ఏవిక్షన్ షీల్డ్ గెలుచుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళని ఒక స్టెప్ ముందుకు తీసుకొని రమ్మని అందరితో నాగార్జున చెప్పగా.. ముగ్గురికి మూడు స్టెప్పులు ముందుకు తీసుకొని వస్తారు. ముగ్గురు ఈక్వల్ గా ఉంటారు. ఆ తర్వాత రోహిణి, నబీల్, నిఖిల్ లను తమలో తాము ఎవరు కావాలని అడుగగా.. ఒకరికొకరు చెప్పుకొని మళ్ళీ ఈక్వల్ ఓటింగ్ వస్తుంది. ఇక ఇది జరిగేలా లేదని భావించిన నాగార్జున.. మెగా ఛీఫ్ ప్రేరణని డెసిషన్ చెప్పమంటాడు.

నీ ఒపీనియన్ చెప్పమని అనగానే.. ప్రేరణ వెళ్లి నబీల్ పక్కన నిల్చొని తనని ఒక స్టెప్ ముందుకు తీసుకొని వస్తుంది. ఇందాక రోహిణి అన్నావ్.. ఇప్పుడు నబీల్ అంటున్నావని నాగార్జున అనగానే.. నాకు మెగా చీఫ్ అవడానికి ఛాన్స్ వచ్చింది. రోహిణి వల్లే అందుకే తనకి ఒకటి.. ఇంకా నాకు ఇంకో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నబీల్ అనుకున్నా అందుకే నబీల్ అని ప్రేరణ చెప్తుంది‌. నబీల్ ముందుకు వెళ్లి ఎవిక్షన్ షీల్డ్ ని తీసుకుంటాడు. తర్వాత నబీల్ కి కంగ్రాట్స్ చెప్తాడు నాగార్జున. ఇది రేపు యూజ్ చెయ్యొచ్చా సర్ అని నబీల్ అడుగగా.. ఇప్పటి నుండి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చని నాగార్జున చెప్తాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.