English | Telugu

నబీల్ గివ్ అప్.. అవినాష్ ని మెగా ఛీఫ్ చేయడం కోసమే!

బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ కోసం వారం రోజుల నుండి టాస్క్ ల పరంపర కొనసాగింది. ఇందులో అందరు నువ్వా నేను అన్నట్టూ మినీ యుద్ధమే చేస్తుంటారు. ఇన్ని రోజులగా రెండు క్లాన్స్ గా విడగొట్టిన బిగ్‌బాస్ ఇక నుండి ఒక్కటే క్లాన్ అదే బిగ్ బాస్ క్లాన్ అంటు చెప్పాడు. ఎవరికి వారే ఇక ఇండివిడ్యువల్ గా గేమ్ ఆడండి అంటూ ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పాడు బిగ్ బాస్ మామ.

మెగా చీఫ్ టాస్క్ లో భాగంగా.. థర్మాకోల్ బాల్స్ ఉన్న సంచులని మెగా చీఫ్ కంటెండర్స్ గా ఉన్నవాళ్ళు వేసుకొని రౌండ్ గా తిరగాలి. వాళ్ళ సంచి నుండి బాల్స్ పోకుండా కాపాడుకోవాలి. మొదటగా హరితేజ, ఆ తర్వాత తేజ ఇలా అందరు ఒక్కొక్కరు బయటికి వస్తారు. మొత్తంగా నబీల్, ప్రేరణ, నిఖిల్, అవినాష్ ఉంటారు. వారిలో అవినాష్ ని ప్రేరణ టార్గెట్ చేస్తుంది. కానీ ప్రేరణని నిఖిల్ వదిలేసి నబీల్ ని టార్గెట్ చేస్తాడు. దాంతో నబీల్, అవినాష్ లకి కోపం వస్తుంది. ఇక ప్రేరణ గేమ్ నుండి అవుట్ అవుతుంది. చివరగా నబీల్, నిఖిల్, అవినాష్ లు రేస్ లో ఉంటారు. టాస్క్ స్టార్ట్ అవ్వకముందు.. మెగా చీఫ్ నువ్వే అవ్వు నేను సపోర్ట్ చేస్తానని నిఖిల్ పై కోపంతో అవినాష్ కి చెప్తాడు నబీల్. దానికి అవినాష్ సరే అంటాడు. ఇక ముగ్గురు ఆడుతుంటే.. అవినాష్, నబీల్ కలిసి నిఖిల్ ని టాస్క్ నుండి తప్పిస్తారు.

నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను.. నువ్వే చీఫ్ అవ్వు అంటు అవినాష్ తో నబీల్ చెప్తాడు. ఇక ఆ మాట మీదనే ఉంటాడు నబీల్. చివరి రౌండ్ లో అవినాష్, నబీల్ ఉంటారు. ఇక నబీల్ గేమ్ ఆడకుండా.. గివ్ అఫ్ ఇస్తాడు. అది చూసి అందరు ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావ్ ఆడు అంటారు. కానీ చివరగా గెలిచింది అవినాషే.. ఇక హౌస్ లో కొత్తగా మెగా చీఫ్ గా అవుతాడు అవినాష్. నబీల్ ఆడితే తనే చీఫ్ అయ్యేవాడు కానీ మాట ఇచ్చాడు కాబట్టి గివ్ అప్ ఇచ్చాడు. అయితే ఇదే విషయం గురించి వీకెండ్ లో నబీల్ కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చేలా ఉన్నాడు నాగార్జున.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.