English | Telugu

పిల్లలతో కార్తీక్ ఆటలు... జైల్లో మోనిత కలవరపాటు!

కార్తీక్‌ను తనను మర్చిపోయేలా దీప మాయ చేస్తుందేమోనని జైలుకు వెళ్లిన మోనిత కలవరపాటుకు గురి అవుతుంటే... ఇంట్లో హాయిగా కార్తీక్ పిల్లలతో ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. అతడిని చూసి తల్లితండ్రులు సంతోషిస్తున్నారు. కార్తీక్ భార్య దీప మాత్రం మోనిత తమ జోలికి రాకుండా ఉంటే చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఉత్కంఠభరిత సన్నివేశాలు లేనప్పటికీ తర్వాత ఏం జరుగుతుందో? అని ఆసక్తి రేకెత్తించేలా 'కార్తీక దీపం' సీరియల్ సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ (సెప్టెంబర్ 23, 1152)లో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...

జైల్లో తన గది గోడల మీద 'నా కార్తీక్... నా కార్తీక్' అని రాసుకుని మోనిత మురిసిపోతూ ఉంటుంది. మరోపక్క కార్తీక్‌ను కలవనివ్వకుండా దీప మాయ చేస్తుందేమోనని కలపడుతుంటుంది. "అసలే దీప! మామూలు ఆడది కాదు. నన్ను మర్చిపోయేలా చేస్తుందా? 18 నెలలు నాకు తక్కువే. కానీ, కార్తీక్ ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కదా! అప్పుడు ఎలా? వాళ్లకు టైమ్ ఇస్తే ఏదైనా చేస్తారు. నేను అంత టైమ్ ఇవ్వనుగా. ఇస్తే మోనితను ఎలా అవుతాను?" అని చిటికెలు వేస్తూ ఆవేశంతో ఊగుతుంది. అక్కడితో ఆగలేదు.

దీపను గుర్తు చేసుకుంటూ, తన కళ్ల ముందు దీప లేకపోయినా వార్నింగ్ ఇస్తుంది. "దీపక్కా! మోనిత జైలుకు వెళ్ళింది. డాక్టర్ బాబును బుట్టలో వేసుకుందామనుకుంటున్నావా? మీ ఇద్దర్నీ కలవనిచ్చేది లేదు. మోనిత ఇక్కడ. కొంగు నోట్లో పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటానని కలలు కంటున్నావా? అలాగని అనుకున్నావా? నేను ఏడిపించే టైప్ కానీ ఏడ్చే టైప్ కాదమ్మా!. ఇక్కడ (జైల్లో) కూర్చుని అక్కడ (ఇంట్లో) ఉన్న నీకు చుక్కలు చూపిస్తా. నీ మీద ఒట్టు దీపక్కా. ప్రామిస్" అని మోనిత తనలో అపరిచితురాల్ని చూపిస్తుంది. కాసేపు ఏడుస్తూ, కాసేపు సైకోలా నవ్వుతూ, కాసేపు కోపంగా చూస్తూ వింతగా ప్రవర్తించింది.

మరోవైపు ఇంట్లో పిల్లలతో కార్తీక్ ఆడుకుంటూ ఉంటాడు. అది చూసి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత పిల్లల స్కూల్ ఫీజ్ కట్టడానికి పిల్లలతో పాటు దీపను తీసుకుని బయలు దేరతాడు. అమెరికా వెళదామని అన్న కార్తీక్ ఫీజ్ కట్టడానికి బయలుదేరడంతో దీపకు ఏమీ అర్థం కాదు. ఎలాగైనా అమెరికా ప్రయాణం క్యాన్సిల్ కావాలని కోరుకుంటుంది. మరోవైపు మోనిత తమ జోలికి రాకుండా ఉంటే చాలని, అంతకు మించి ఏమీ వద్దని భగవంతుడిని ప్రార్థిస్తుంది.

కట్ చేస్తే... జైల్లో సుకన్య అనే ఖైదీకి కడుపులో నొప్పి వస్తుంది. డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో జైలుకు ఖైదీగా వచ్చిన డాక్టర్ మోనితను ఓ పోలీస్ పిలుస్తారు. తర్వాత ఏం జరిగింది?స్కూల్ దగ్గర పిల్లల్ని, షాపింగ్ దగ్గర దీపను వదిలేసి కార్తీక్ ఏ పని మీద బయటకు వెళ్ళాడు? అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.