English | Telugu

వారసుడి చేతికి ఎస్పీబీ వాడిన మైక్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఈటీవీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఆయనతో రెండు కార్యక్రమాలు... 'పాడుతా తీయగా', 'స్వరాభిషేకం' చేసింది ఈటీవీ. ఆ కార్యక్రమాల కోసం ఎస్పీబీ వాడిన మైక్‌ను, ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌కు అందజేశారు.

సెప్టెంబర్ 25కు ఎస్పీబీ ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా 'బాలుకు ప్రేమతో' పేరుతో ఈటీవీ ఈ కార్యక్రమం నిర్వహించింది. సెప్టెంబర్ 26న ప్రసారం కానుంది. అందులో చరణ్‌కు ఎస్పీబీ మైక్ అందజేశారు రామౌజీరావు. ఇదొక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పవచ్చు. ఆ మైక్ చేతబట్టి చరణ్ కార్యక్రమంలో పాటలు పాడారు.

'బాలుకు ప్రేమతో' కార్యక్రమానికి సంగీత దర్శకులు కోటి, ఎంఎం కీరవాణి, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్ సహా చిత్ర, సునీతతో పాటు పలువురు గాయనీ గాయకులు, జొన్నవిత్తుల, అనంత శ్రీరామ్ వంటి గేయ రచయితలు హాజరయ్యారు. బాలుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరు అయ్యారు.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.