English | Telugu
కార్తీక్‌కు కునుకు లేకుండా చేస్తున్న మోనిత
Updated : Nov 18, 2021
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న ధారావాహిక `కార్తీక దీపం`. గత కొంత కాలంగా వరుస ట్విస్ట్‌లతో సాగుతున్న ఈ సీరియల్ ఇటీవల గాడితప్పిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసింది. వరుస ట్విస్ట్‌లతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్న ఈ సీరియల్ తాజాగా సరికొత్త మలుపులతో సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ మరింత రసవత్తర మలుపులతో ట్విస్ట్‌లతో సాగబోతోంది.
ఈ ఎపిసోడ్‌లో మోనిత దీపావళి జరుపుకోబోతోంది. అందంగా రెడ్ కలర్ సారీలో ముస్తబైన మోనిత దీపాలని అందంగా అలంకరించి దీపాలనే చూస్తూ ఈ సమయంలో కార్తీక్‌తో వుంటే బాగుండు అనుకుంటూ వుంటుంది. కార్తీక్‌తో కలిసి దీపావళిని ఎప్పుడు జరుపుకుంటానా? అని కలలు కంటూ వుంటుంది మోనిత. ఇలా ఆలోచిస్తుండగానే ప్రియమణి వచ్చేస్తుంది. వెంటనే ఆనందరావుని జాగ్రత్తగా చూసుకో ఈ రోజు దీపనో నేనో తేలిపోవాలని చెప్పి కార్తీక్ దగ్గరికి వెళుతున్నానంటుంది.
ఈ మాటలు విన్న ప్రియమణి ఆగ్రహంతో కసురుకుంటుంది. పట్టించుకోకుండానే కార్తీక్‌ని కలవడానికి బయలుదేరుతుంది మోనిత. తను వస్తున్న విషయాన్ని కార్తీక్‌కి ఫోన్ చేసి చెబుతుంది. మోనిత ఇంటికి వచ్చి మళ్లీ ఎలాంటి గొడవకు తెరలేపుతుందోనని కార్తీక్ హడావిడిగా మోనిత ఇంటికి బయలుదేరతాడు.. మద్యలో ఏం జరిగింది? .. మోనిత .. కార్తీక్‌కి ఎలాంటి షాకిచ్చింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.