English | Telugu

బిగ్‌బాస్ : స‌న్నీని ఎర్రి** చేస్తున్నారా?

బిగ్‌బాస్ విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతున్నా బిగ్‌బాస్ నిర్వాహ‌కుల తీరులో మాత్రం మార్పు రావ‌డం లేదు అంటున్నారు నెటిజ‌న్స్‌. బుధ‌వారం సంచాల‌క్‌గా వ్య‌వ‌హ‌రించిన యాంక‌ర్ ర‌వి ఇచ్చిన తీర్పుపై మండిప‌డిన స‌న్నీ త‌న స్నేహితులు మాన‌స్‌, కాజ‌ల్‌ల‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. దీంతో హౌస్ ఒక్క‌సారిగా హీటెక్కింది. ప్ర‌తీ విష‌యంలోనూ ఒక్క‌టిగా వుండే ముగ్గురు స్నేహితుల మ‌ధ్య బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీలో భాగంగా ఇచ్చిన టీష‌ర్ట్‌ల టాస్క్‌తో చిచ్చు పెట్ట‌డంతో నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో మండిప‌డుతున్నారు.

ఇదిలా వుంటే గురువారం ఎనిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌కు వేదిక‌గా కాబోతున్న‌ట్టుగా తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన బిగ్‌బాస్ ప్రోమో హౌస్‌లో కెప్టెన్ ర‌వి ... స‌న్నీ .. మాన‌స్‌ల‌ని విడిదీయ‌డానికి కొత్త ఎత్తులు వేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. దీనిక బిగ్‌బాస్ కూడా చేయి క‌ల‌ప‌డం స‌న్నీ అభిమానుల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. నెక్ట్స్ కూడా క్యాప్టెన్సీ పోటీ దారుగా ర‌వి నిల‌వాలంటే పోటీలో మాన‌స్‌, స‌న్నీ మాత్ర‌మే వుండాల‌ని శ్రీ‌రామ‌చంద్ర .. ర‌వితో సీక్రెట్‌గా చెప్ప‌డం..

వ‌న్ ఈజ్ డిస్ట్ర‌క్ష‌నా? టూ ఈజ్ డిస్ట్ర‌క్ష‌నా? అని ర‌వి అడిగితే.. వ‌న్ ఈజ్ డిస్ట్ర‌క్ష‌న్ అని శ్రీ‌రామ‌చంద్ర చెప్ప‌డం హౌస్‌లో ర‌వి కొత్త గేమ్‌ని తెర‌లేపాడ‌నే సంకేతాల్ని అందిస్తోంది. ఈక్ర‌మంలోనే బిగ్‌బాస్ ర‌విని క‌న్ఫేష‌న్ రూమ్‌లోకి పిలిచి ప‌వ‌ర్ టూల్‌ని మీరు సొంతం చేసుకుంటారా? లేక ఇత‌ర ఇంటి స‌భ్యుల్లోని ఒక‌రికి ఇస్తారా? అని బిగ్‌బాస్ అడ‌గ‌డం.. ఈ టూల్‌ని స‌న్నీకి ఇవ్వాల‌నుకుంటున్నాన‌ని ర‌వి చెప్ప‌డం.. అలా చెప్పిన‌ట్టే స‌న్నీకి ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తే నేను తీసుకోన‌ని స‌న్నీ స‌మాధానం చెప్ప‌డం.. అలా అని నువ్వు చెప్ప‌డానికి వీల్లేద‌ని.. ఇది బిగ్‌బాస్ ఆదేశ‌మ‌ని ర‌వి చెప్ప‌డంతో అయిష్టంగానే స‌న్నీ టూల్‌ని తీసుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్రోమో చివ‌ర్లో `న‌న్ను రెచ్చ‌గొట్టి పంపిస్తారు.. లాస్ట్‌కి ఎర్రిపుష్పం చేస్తారూ.. అంటూ స‌న్నీ వేసిన పంచ్ ఓ రేంజ్‌లో పేలింది.