English | Telugu
"శ్రీదేవి నాకు రెండో అమ్మ".. మహేశ్వరి భావోద్వేగం!
Updated : Sep 1, 2021
‘గులాబీ’ హీరోయిన్ మహేశ్వరి గుర్తుందా? అదేనండీ శ్రీదేవి చెల్లెలు! అంటే.. సొంత చెల్లెలు కాదనుకోండి. పిన్ని కూతురు! చాలా రోజుల తర్వాత మహేశ్వరి టీవీ షోలో కనిపించారు. ‘క్యాష్’ ప్రోగ్రామ్‌కు ఆమెను తీసుకొచ్చారు. అందులో శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని మహేశ్వరి గుర్తు చేసుకున్నారు. తనకు శ్రీదేవి రెండో అమ్మలాంటిదని చెప్పారు. ఎమోషనల్ అయ్యారు.
‘‘కొంతమంది వదిలేసి వెళ్లిపోయినప్పుడు వాళ్ల ఫ్యామిలీ బాధపడతారు. కొంతమంది వెళ్లిపోయినప్పుడు ఇలా ప్రపంచమంతా బాధపడుతుంది. దటీజ్ శ్రీదేవిగారు’’ అని సుమ చెప్పారు. మహేశ్వరితో పాటు హీరోయిన్లు రాశి, సదా, శ్రద్ధా దాస్ అతిథులుగా వచ్చిన క్యాష్ షో శనివారం, సెప్టెంబర్ 4న టెలికాస్ట్ కానుంది.
ప్రజెంట్ సెలబ్రిటీలు అందరూ యూట్యూబ్ ఛానళ్ళు ప్రారంభించి... హోమ్ టూర్, కిచెన్ టూర్ అంటూ వీడియోస్ చేస్తున్నారు. దీనిని ‘క్యాష్’లో చూపించే ప్రయత్నం చేశారు. సదా హోమ్ టూర్ పేరుతో కాసేపు సందడి చేశారు. అందులో ఎంటరైన సుమ... ‘నేను అమ్మగారింట్లో పని చేస్తున్నా. పదేళ్ల నుంచి! నాకు జీతం పెంచలే ఇప్పటివరకూ’ అని కామెడీ చేశారు. ‘ఆర్య 2’ సెట్‌లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఏడ్చేదాన్ని అని తనకు ‘వాటర్ ట్యాప్’ అని పేరు పెట్టారని శ్రద్ధా దాస్ తెలిపారు. మొత్తంమీద ప్రోమో సందడిగా సాగింది.