English | Telugu

దసరాకు బిగ్ సర్ప్రైజ్.. ఒకే ఫ్రేమ్ లో తారక్, మహేష్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో జెమిని టీవీలో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. గతంలో 'బిగ్ బాస్'తో ఆకట్టుకున్న తారక్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ షోపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జెమిని.. తారక్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి రికార్డ్ స్థాయిలో రేటింగ్ తెప్పించాలన్న ఉద్దేశంతో తారక్ సన్నిహితులైన టాలీవుడ్ బడా సెలబ్రిటీలను రంగంలోకి దింపుతుంది.

తారక్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. తారక్, చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాతో వీరి ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది. దీంతో తారక్ షో కోసం చరణ్ ని రంగంలోకి దింపారు నిర్వాహకులు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివలను రంగంలోకి దింపింది జెమిని. ఈ ఎపిసోడ్ సోమవారం టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది.

ఇక దసరా స్పెషల్ ఎపిసోడ్ కోసం 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో నిర్వాహకులు సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఈ ఎపిసోడ్ షూట్ కూడా చేశారని సమాచారం. తారక్-మహేష్ కలిస్తే ఎపిసోడ్ రేటింగ్ ఏ స్థాయిలో దూసుకుపోతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఐపీఎల్, బిగ్ బాస్ షో, సీరియల్స్ ని తట్టుకొని మంచి రేటింగ్ సాధించాలంటే ఈ మాత్రం సెలబ్రిటీస్ ని రంగంలోకి దింపాలన్న ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.