English | Telugu

బిగ్‌ బాస్ 5: ఉమాదేవి అవుట్!

'బిగ్‌ బాస్-5' నుండి మరో మహిళ ఎలిమినేట్ అయ్యింది. తొలి వారం హౌస్ నుండి సరయును బయటకు పంపిన బిగ్ బాస్... రెండో వారం ఉమాదేవిని పంపించారు. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు మహిళలు షో నుండి బయటకు వచ్చినట్టు అయ్యింది. దాంతో నామినేట్ అయిన మిగతావాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

ఉమాదేవితో పాటు రెండో వారంలో ఎలిమినేషన్స్ ప్రక్రియలో నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, ప్రియ, యాని మాస్టర్ నామినేట్ అయ్యారు. చివరకి నటరాజ్, ఉమాదేవి మధ్య గట్టిపోటీ నెలకొంది. ఇద్దరిలో ఉమాదేవికి తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు.

నిజం చెప్పాలంటే... ఉమాదేవి ఎలిమినేషన్ అందరూ ఊహించిందే. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు ఉమాదేవి కోపం షో చూసేవాళ్లల్లో ఆమెపై వ్యతిరేక భావం ఏర్పడేలా చేసింది. తోటి సభ్యులను నోటికి వచ్చినట్టు బూతులు తిట్టడం, ఇతరులతో ప్రవర్తించేటప్పుడు విపరీత ధోరణి తమకు నచ్చడం లేదని చాలామంది గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇప్పుడు ఉమాదేవి తన కోపం, ప్రవర్తన కారణంగా ఎలిమినేట్ అయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.