English | Telugu
`కామెడీ స్టార్స్`లో లోబోకి ఘోర అవమానం!
Updated : Nov 13, 2021
రియాలిటీ షోల మాస్టర్ ఓంకార్ `స్టార్` మా` కోసం `కామెడీ స్టార్స్` పేరుతో కామెడీ షోని అందిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తాజాగా అలీ, హీరోయిన్ శ్రీదేవి జడ్జ్‌లుగా, శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తూ నవ్వులు పూయిస్తోంది. ఈ ఆదివా3రం ఈ షో మరింతగా కామెడీతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయబోతోంది.
ఈ ఆదివారం ఈ షోలోకి బిగ్‌బాస్ సీజన్ 5 ఫేమ్ లోబో రాబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని స్టార్ మా ఇటీవలే విడుదల చేసింది. ప్రోమోని బట్టి చూస్తుంటే లోబోని ఈ షోలో బకరాని చేసినట్టుగా తెలుస్తోంది. బస్సెక్కితే ఎవ్వరైనా ఊరికిపోతరు కానీ బిగ్‌బాస్‌లో మా లోబో అన్న నిద్రబోతడు.. అంటూ లోబోపై ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లోనే అదిరిపోయే పంచ్‌వేసి షాకిచ్చారు. ఇదే క్రమంలో తను హౌస్‌లోకి వెళ్లడానికి ముందు ఓట్లు వేయించమన్న అని లోబో అనగానే అతని కటౌట్ వున్న ఓ ఫొటో దాని కింద ఓ నంబర్‌ని డిప్లే చేస్తూ లోబో ముందుకు తీసుకొచ్చారు.
అయితే ఆ ఫొటో కింద వున్న నంబర్ తనది కాదని ఆ నంబర్ యాంకర్ రవిది అని లోబో లబోదిబోమనడం నవ్వులు పూయిస్తోంది. ఇదిలా వుంటే లోబోని ఓ వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తానంటూ కూర్చోబోట్టి తిక్క తిక్క ప్రశ్నలు వేయడం ప్రహసనంగా మారింది. `బిగ్‌బాస్‌లోకి వాళ్లు పిలిచారా? లేక మీరు అడుక్కున్నారా? ... దున్నపోతు ముళ్లపంది.. అంటే మీరు ఒప్పుకుంటున్నారా? .. మీకు పెళ్లైంది... ఇవన్నీ మీకు గుర్తున్నాయ్ .. మరి లోపల ఉపగారితో సరసాలు ఆడారు కదా అప్పుడు గుర్తు లేదా? అంటూ యాంకర్ లోబోని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం.. విసిగెత్తిపోయిన లోబో నా ఇష్టంర బయ్ ... అని ఫైర్ అయ్యాడు.
ఆ తరువాత `లోబో బిగ్‌బాస్ హౌస్‌లోకి నవ్వించడానికి లోపలికి వెళ్లి నవ్వుల పాలై బయటికి వచ్చాడు? అని యాంకర్ అనగానే `అరేయ్ ఏందిరా క్వోశ్చన్‌లు ఇవీ? అంటూ యాంకర్‌పైకి దాడికి వెళ్లడం.. తనని షోకి పిలిచిన భాస్కర్‌కి చెప్పేసి లోబో షో నుంచి బయటికి వెళ్లిపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా వుండే అవకాశం వుందని ప్రోమో ద్వారా హింట్ లభించడంతో సండే ఎపి\సోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.