English | Telugu
శేఖర్ మాస్టర్‌కు కొబ్బరిచిప్పలా కనిపించిన సుధీర్ నెత్తి!
Updated : Nov 12, 2021
ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ షో 'ఢీ' సూపర్ పాపులర్ అయ్యింది. ఇప్పటికి 12 సీజన్లు పూర్తిచేసుకొని, 13వ సీజన్ నడుస్తోందంటేనే ఏ రేంజ్‌లో ఆ షోకు వ్యూయర్స్ నుంచి ఆదరణ లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ షోకు ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తుండగా, ప్రియమణి, పూర్ణ, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో పూర్ణకు బదులు సెలబ్రిటీ జడ్జిగా డైరెక్టర్ నందినీరెడ్డి కనిపించనున్నారు. ఈ షోలో సుధీర్ కొద్దిగా జుట్టు వచ్చిన గుండుతో దర్శనమివ్వనున్నాడు. దాంతో అతడి తల శేఖర్ మాస్టర్‌కు కొబ్బరిచిప్పలా కనిపించింది. ఆ కథేమిటంటే...
ఈ షోకు గుండు తలకు టవల్ చుట్టుకొని వచ్చాడు సుధీర్. శేఖర్ దగ్గరకు వెళ్లి "మా ఏరియాలో దసరాకు అమ్మవారిని పెడుతున్నాం. ఫుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొంచెం చందా ఉంటే వేస్తే.." అని అడిగాడు.
"నేను చందా వెయ్యాలంటే నన్ను ఇంప్రెస్ చెయ్యాలి. చిన్నప్పుడు నేను కోతిగారడీ చూసేవాడ్ని. అదొక్కసారి చూడాలని వుంది" అన్నాడు శేఖర్.
"ఏం చేస్తాం సార్.. కోతి లాగా?" అంటూ కోతి చేష్టలు మొదలుపెట్టాడు సుధీర్. "అమ్మా.. అయ్యగారికి దణ్ణం పెట్టు" అంటూ కోతిలా గెంతుతూ దండం పెట్టాడు. అతడి చేష్టలు చేసి ప్రదీప్ పగలబడి నవ్వాడు.
"కోతికేదన్నా ఇవ్వాలి.. అరటిపండో, గిరటిపండో ఏదో ఒకటి" అనడిగాడు సుధీర్.
"కొబ్బరిచిప్ప లేదబ్బా.. ఓ.. నీ నెత్తిమీదే ఉందిగా" అన్నాడు శేఖర్, సుధీర్ తలను చూస్తూ. ఆ తర్వాత ప్రియమణిని చూపిస్తూ, "ఇక్కడికొచ్చి అమ్మని అడుగు" అన్నాడు.
సుధీర్ తనదైన ధోరణిలో "అమ్మగారికి ఒక ముద్దుపెట్టరా" అంటూ ఆమె దగ్గరకు కోతిలా గెంతుతూ వెళ్లి, అంతలోనే "వద్దులే" అంటూ ఆగిపోయాడు.
"అమ్మగారు మొట్టికాయ వేస్తారు చూడు.. కొబ్బరిచిప్ప మీద" అన్నాడు ప్రదీప్. ఈ హిలేరియస్ సీన్ వచ్చే బుధవారం ప్రసారమయ్యే 'ఢీ 13' ఎపిసోడ్‌లో మనం చూడొచ్చు.