English | Telugu
పిల్లలు పుట్టాక తను ఎలా మారిందో వివరిస్తున్న లాస్య
Updated : Jun 14, 2023
యాంకర్ లాస్య.. అందరికి తెలిసిన సెలబ్రిటీ. ఒకప్పుడు అన్ని ఛానెల్స్ కి మోస్ట్ ఛాయిస్ లాస్య అని చెప్పొచ్చు. ఇక యాంకర్ రవి, లాస్య కాంబినేషన్ షో అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కాంబినేషన్ ఎంత హిట్ అనేది అందరికి తెలిసిందే. సంథింగ్ స్పెషల్ షోకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. కొంతకాలం పాటు బుల్లి తెరకు దూరంగా ఉన్న లాస్య మళ్ళీ బిగ్ బాస్ సీజన్ -4 లో ఎంట్రీతో ఫామ్ లోకి వచ్చిందనే చెప్పాలి.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు వంట చేస్తూ అందరి కడుపునింపిన లాస్య.. టైటిల్ గెలవకపోయినా చివరికి వంటలక్కగా బయటకొచ్చింది. లాస్య తను షోస్ చేస్తున్నప్పుడు ఏనుగు, చీమ జోక్ లు చెప్తూ ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. అయితే లాస్య, రవి మధ్య ఏదో రిలేషన్ ఉందని అప్పట్లో పుకార్లు రావడంతో తను టీవీ రంగానికి దూరమైందని అనుకున్నారు. కానీ అదేదీ కాదని వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని, రవి తన తప్పు తెలుసుకొని సారీ కూడా చెప్పాడని లాస్య ఒక ప్రోగ్రామ్ లో చెప్పింది. ఆ తర్వాత మంజునాథ్ ని పెళ్ళిచేసుకొని కొన్ని సంవత్సరాల పాటుగా బుల్లితెరకు దూరమైంది లాస్య.
లాస్య-మంజునాథ్ కి మొదట అబ్బాయి పుట్టగా తాజాగా మరో అబ్బాయి జన్మించాడు. అయితే ప్రతీ అప్డేడ్ ని ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేసే లాస్య.. ఇప్పుడు మరింత అడ్వాన్స్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తోంది. అయితే పోస్డ్ డెలివరీ అంటూ తనకి బాబు పుట్టాక, తను ఎలా ఉంటుందో, పేరు పెట్టేప్పుడు ఒక వ్లాగ్, మదర్స్ డే వ్లాగ్, తనకి బాబు పుట్టాక తన దినచర్య ఏంటో వీడియో చేసి వ్లాగ్ గా అప్లోడ్ చేసింది లాస్య. ప్రెగ్నెన్సి తర్వాత తను చాలా మారిందని, దానికి తగ్గట్టుగా యోగా చేస్తున్నట్టుగా లాస్య ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.