English | Telugu
టైం వస్తే ప్రొపోజ్ చేస్తా అన్న కావ్య...
Updated : Jun 14, 2023
"నీతోనే డాన్స్" గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఇందులో రీల్ అండ్ రియల్ కపుల్స్ వచ్చి మస్త్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. నిఖిల్-కావ్య జోడి డాన్స్ మంచి కలర్ ఫుల్ గా సాగింది. జడ్జెస్ కూడా వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ ని బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత "కావ్యలో మీకు నచ్చేది ఏమిటి" అని శ్రీముఖి నిఖిల్ ని అడిగేసరికి " ఆమె కళ్ళు, నవ్వు" అని చెప్పాడు..అదే ప్రశ్నను కావ్యాన్ని కూడా అడిగింది. "నిఖిల్ హైట్, తన జోవియల్ నేచర్ అంటే ఇష్టం" అని చెప్పింది కావ్య. "ఇన్ని ఇష్టపడే క్వాలిటీస్ ఉన్నప్పుడు ఇంకా కపుల్ ఎందుకు కాలేదు" అని శ్రీముఖి అడిగింది "టైం రావాలి కదా" అని చెప్పింది కావ్య.
"టైం వేస్ట్ ప్రొపోజ్ చేయడానికి ఓకే నా" "మే బి చేస్తానేమో" అని చెప్పింది కావ్య. ఆ సరైన టైం మీకు త్వరలోనే రావాలి అని కోరుకుంటూ కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ టైటిల్ తో చేసిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది శ్రీముఖి. తర్వాత స్టెల్లా-యాదమ్మ రాజు జంట వచ్చి డాన్స్ పెర్ఫార్మ్ చేసింది. వీళ్ళు తమ లైఫ్ లో పడిన కష్టాలు చెప్పి సరదాగా నవ్వించారు. వీళ్ళ ఫొటోస్ తో "కితకితలు" అనే పోస్టర్ వేసి చూపించింది శ్రీముఖి. తర్వాత పవన్ - అంజలి వచ్చి పెర్ఫార్మ్ చేశారు. వీళ్లకు బెస్ట్ విషెస్ చెప్పడానికి వాళ్ళ అమ్మాయి ధన్వీ వచ్చి కాసేపు ఎంటర్టైన్ చేసింది.
తర్వాత వీళ్ళ ఇద్దరి కోసం "ఒకరికి ఒకరు" అనే పోస్టర్ ని చూపించింది శ్రీముఖి. అమరదీప్-తేజస్విని ఇద్దరి డాన్స్ మాములుగా చేయలేదు. ఇంకా వీళ్ళ లవ్ స్టోరీలో ట్విస్టులు చెప్పి నవ్వించారు. "అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి" అనే టైటిల్ ని ఇచ్చేసరికి అమరదీప్ పవన్ కళ్యాణ్ మానరిజమ్ చేసి చూపించాడు. డైరెక్టర్ సాగర్- దీప జోడి కూడా అద్భుతంగా డాన్స్ చేసి జడ్జెస్ ని మెప్పించారు. "నిన్ను కోరి" అనే టైటిల్ వాళ్లకు సరిగ్గా సెట్ అవుతుందంటూ చూపించింది శ్రీముఖి. తర్వాత సందీప్ - జ్యోతి కూడా పెర్ఫార్మ్ చేసి ఫుల్ ఎంటర్టైన్ చేసేసరికి "హలో గురు ప్రేమకోసమే" అనే పోస్టర్ వేసింది శ్రీముఖి.
శివ కుమార్ - ప్రియాంక జైన్ ఇద్దరూ చాలా కూల్ గా డాన్స్ చేశారు. వాళ్లకు "అలా మొదలయ్యింది" అనే పోస్టర్ వేసింది. ఇంకా నటరాజ్ - నీతూ ఇద్దరూ వచ్చి తమ స్టయిల్లో డాన్స్ చేశారు. వీళ్లకు "మొండి మొగుడు పెంకి పెళ్ళాం" అనే పోస్టర్ వేసింది. ఈ ఎనిమిది జంటలతో ఈ పోటీ మొదలయ్యింది. శనివారం, ఆదివారం రెండు రోజుల్లో ప్రసారమయ్యే ఈ షోని రెండు డివిజన్స్ గా డివైడ్ చేసింది శ్రీముఖి. శనివారం వచ్చే టీంకి "ధూమ్ ధామ్ టీం " అని పేరు పెట్టింది. ఈ టీంలో పవన్-అంజలి, నటరాజ్-నీతూ, స్టెల్లా-యాదమ్మ రాజు, నిఖిల్-కావ్య ఉంటారు. ఆదివారం వచ్చే టీకి "దుమ్ము లేపు" అని పేరు పెట్టింది. ఈ టీంలో ఆట సందీప్-జ్యోతి, అమరదీప్ - తేజు, శివ్-ప్రియాంక, డైరెక్టర్ సాగర్ - దీప జోడీస్ ఉన్నాయి