English | Telugu

రాహుల్ హ‌త్తుకున్న ఆ అమ్మాయెవ‌రు?

రాహుల్ హ‌త్తుకున్న ఆ అమ్మాయెవ‌రు?

 

బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో నిలుస్తున్నాడు. అషురెడ్డితో స్నేహం, మ్యూజిక్ ఆల్బమ్స్ వంటి విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. అమ్మాయిల విషయంలో రాహుల్ పై పలు కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్లు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం పునర్నవి భూపాలంతో చాలా క్లోజ్ గా ఉన్న రాహుల్.. బయటకు వచ్చిన తరువాత అషురెడ్డితో సన్నిహితంగా మెలుగుతూ వ‌స్తున్నాడు. 

ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. తామిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని ఈ జంట ఎన్ని సార్లు చెప్పినా.. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంద‌నేది చాలా మంది అభిప్రాయం. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ ఓ అమ్మాయిని హత్తుకొని ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆమె పేరు హరిణ్య రెడ్డి. ఆమెని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు రాహుల్. అత‌ను షేర్ చేసిన ఫొటోలో ఆ ఇద్ద‌రూ ఒక అపార్ట్‌మెంట్ బాల్క‌నీలో నిల్చొని న‌వ్వుతున్నారు. రాహుల్ ఆమెని పొదివి ప‌ట్టుకోగా, హ‌రిణ్య అత‌డి ష‌ర్టును ప‌ట్టుకొని ఉంది. ఇద్ద‌రి మ‌ధ్యా చాలా స‌న్నిహిత‌త్వం ఉన్న‌ట్లు ఆ ఫొటో చూస్తే అర్థ‌మైపోతోంది. గ‌మ‌నిస్తే.. అది హ‌రిణ్య వాళ్ల ఫ్లాట్‌గా అర్థ‌మ‌వుతుంది. రాహుల్ కాళ్ల‌కు షూస్ ఉండ‌గా, హ‌రిణ్య కాళ్ల‌కు చెప్పులు లేవు. 

ఆ ఫొటోని షేర్ చేసి, ఏడాది కాలంగా తనకు అండగా నిలిచినందుకు థాంక్స్ అని చెబుతూ.. ఇలానే వందేళ్ల పాటు తనను ప్రోత్సహిస్తూ ఉండాలని రాహుల్ కాప్ష‌న్ పెట్టాడు. తన జీవితంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఈమె ఒకరంటూ తన ఫాలోవర్లకు పరిచయం చేశాడు. ఈ ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది 'కొత్త గర్ల్ ఫ్రెండా అన్నా?' అంటూ రాహుల్ ని నేరుగా ప్రశ్నిస్తున్నారు. 

రాహుల్ హ‌త్తుకున్న ఆ అమ్మాయెవ‌రు?