English | Telugu

కొంచెం అందంగా ఉంటే తట్టుకోలేరా...షర్ట్ బటన్స్ విప్పి మరీ


ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది వేసిన డైలాగ్ కి శేఖర్ మాష్టర్ ఇచ్చిన ఆన్సర్ భలే కామెడీగా ఉంది. "ముందు ఆ స్పెక్ట్స్ తియ్యి" అని శేఖర్ మాస్టర్ అన్నాడు. "కొంచెం అందంగా కనబడితే తట్టుకోలేరా" అని ఓవర్ డైలాగ్ వేసాడు ఆది. " ఎవడు..ఎవడాడు అందంగా ఉంది" అన్నాడు శేఖర్ మాష్టర్. "అందం అంటే ఏంటండీ..నేను చెప్తా ఆగు" అంటూ స్టేజి మీద షర్ట్ తీసేయడానికి రెడీ అయ్యి బటన్స్ విప్పేస్తుండగా శేఖర్ మాష్టర్ "వద్దు...ఆగు చంపేస్తా నిన్ను" అని ఆది దగ్గరకు వచ్చి షర్ట్ బటన్స్ పెట్టాడు మాష్టర్. "మా దగ్గర షర్ట్ బటన్స్ తియ్యమంటేనే సిగ్గు పడతారు ఎక్కడెక్కడికో వెళ్లి కోట్ అంతా తీసేసి" అని ఓవర్ గా డైలాగ్ చెప్పాడు ఆది.

తర్వాత హన్సిక వచ్చి ఎం చెప్పిందో కానీ అటు నుంచి హోస్ట్ నందు, ఇటు నుంచి హైపర్ ఆది వచ్చి షర్ట్ లు విప్పేయడానికి రెడీ అయ్యారు. ఇక ఫైనల్ లో హన్సిక బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేశారు. పెద్ద కేక్ తెచ్చి స్టేజి మీదకు వచ్చి కంటెస్టెంట్స్ అందరూ కలిసి కట్ చేశారు. ఇక ఈ షో మధ్యలో హన్సిక తన ఇంట్లో హెల్మెట్ పెట్టుకుని డాన్స్ చేసిన ఒక అల్లరి వీడియోని ప్లే చేసి అందరూ కాసేపు నవ్వుకున్నారు. కానీ ఈ ఎపిసోడ్ చూడబోతే మొత్తం అందరూ బొత్తాలిప్పుకుని కనిపించేలా ఉన్నారు. ఐతే షోలో డాన్స్ కన్నా కామెడీ ఎక్కువగా ఉండేసరికి నెటిజన్స్ కూడా డాన్సర్స్ అందరినీ త్వరగా ఎలిమినేట్ చేసేస్తే మేము హాయిగా ఆది కామెడీ చూసుకుంటాంగా అని వెటకారంగా మాట్లాడుతున్నారు.