English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్నకి ఇచ్చిపడేసిన శివన్నారాయణ.. కార్తీక్ ఆన్ ఫైర్!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 505 లో.. సుమిత్ర, దశరథ్ ల పెళ్ళి రోజు కోసమని కార్తీక్, దీప కేక్ తీసుకొస్తారు. దానికి శ్రీధర్, కాంచన కూడా వస్తారు. కాసేపటికి ఇద్దరు కేక్ కట్ చేస్తారు. శివన్నారాయణ, పారిజాతం, జ్యోత్స్న, అందరు వరుసగా కేక్ తినిపిస్తారు. ఇక జ్యోత్స్న పుల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది.

మీరంతా అన్నట్లుగా బావకు దీపకు నిజంగానే భార్యభర్తలను కలిపేంత సమర్థత ఉంటే అత్తను మావయ్యను ఇంత వరకూ ఎందుకు కలపలేదు.. ఏం బావా... మా అమ్మనాన్నల గురించే ఆలోచిస్తావా.. మీ అమ్మానాన్నల గురించి ఆలోచించావా అంటూ జ్యోత్స్న వెటకారంగా అడుగుతుంది. జ్యోత్స్నా అని దశరథ్ అనగానే.. ఏం డాడీ.. మీ బావ మీ చెల్లెలు కలిసి ఉండాలని మీరు కోరుకోవడం లేదా.. నాకు ఏదో గుర్తొస్తుంది. కన్నతల్లి పిన్నతల్లి.. మా గ్రానీ నువ్వే ఆ సామెత చెప్పేదానివి ఏంటదని జ్యోత్స్న అంటుంది. ఇక శివన్నారాయణ అందుకొని వాళ్లు కలిసే ఉన్నారంటూ మాటలతోనే కలిపేస్తాడు.

దీప, కార్తీక్‌ల పెళ్లికి మీ శ్రీధర్ మావయ్య భార్యతో వచ్చాడా ఒంటరిగా వచ్చాడా అని అడుగుతాడు.. అత్తతోనే వచ్చాడని జ్యోత్స్న అంటుంది. సత్యనారాయణ వ్రతం జంటగా ఉన్నారా లేదా అని అనగా..జంటగానే ఉన్నారని జ్యోత్స్న అంటుంది. మరి ఈ రోజు.. జంటగానే కనిపిస్తున్నారు కదా అని శివన్నారాయణ అనగానే.. కనిపిస్తున్నారని జ్యోత్స్న అంటుంది. మరి విడిపోయారని నువ్వు ఎలా చెబుతావ్.. కళ్లు కనిపిస్తున్నాయి కదా.. నోటికి ఏదొస్తే అది అంటావా అని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న తలదించుకుంటుంది. ముందు ఆలోచిస్తే నోటికి రావాల్సిన మాటలే వస్తాయని కార్తీక్ కోపంగా అంటాడు. నేను కాంచన వేరు అని నేనెప్పుడు అనుకోలేదు.. మేమంతా ఒకటే అని శ్రీధర్ అంటాడు. విన్నావ్‌గా.. ఈసారైనా వినపడిందా.. ఏదొకటి అవకాశం చూసుకుని ఎదుటివారిని అనడమే.. అసలు నీ చేతకానీతనం వల్లే కదా ఇదంతా జరిగిందంటూ శివన్నారాయణ అరుస్తాడు. పారు అడ్డుపడుతుంది. దాంతో కాస్త శాంతించిన శివన్నారాయణ.. పదండి అంతా తిందాం.. దశరథా పదా.. పారిజాతం రా అని అనవడంతో అందరు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.