English | Telugu

Karthika Deepam2 : ఎమోషనల్ అయిన సుమిత్ర.. రిసెప్షన్ కి దీప ఒప్పుకుంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -195 లో.....కార్తీక్ నా భర్త.. వాళ్ళది అసలు పెళ్లే కాదని జ్యోత్స్న అంటుంది. ఎలాగైనా నా బావని నా సొంతం చేసుకుంటానని సుమిత్రకి చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ప్లీజ్ అత్తయ్య నా కూతురిని వదిలెయ్యండి అని పారిజాతంతో చెప్తుంది సుమిత్ర. పెద్దవాళ్ళుగా చేసేది తప్పని చెప్పాలి కదా అంటుంది. మీరు చేసింది ఏంటని పారిజాతం అంటుంది. ఆ తర్వాత దీప లోపలికి వెళ్తుంది. దీప ఎందుకు రిసెప్షన్ వద్దని అంటుందో నాకు అర్థమైందని అనసూయతో కాంచన అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు.

అవి ఏంటని కాంచన అనగానే.. ట్యాబ్లెట్ మరియు వాళ్ళ రిసెప్షన్ కి శౌర్య వేసుకుంటందని బట్టలు తీసుకొని వచ్చానని కార్తీక్ అంటాడు. మరి దీపకి అని కాంచన అనగానే.. అది మీరు చూసుకుంటారు కదా అని కార్తీక్ అంటాడు. డాక్టర్ ఏమన్నాడని కాంచన అనగానే శౌర్యని హ్యాపీగా చూసుకోమని చెప్పాడు. ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలని కార్తీక్ అంటాడు. ఇంతకీ దీప ఎందుకు రిసెప్షన్ వద్దని అంటుందని కార్తీక్ అడుగుతాడు. అందరు మీ నాన్న ఎక్కడ అని అడుగుతారు కదా అని కాంచన అంటుంది. అవును అందుకే వద్దని అంటున్నానని దీప అప్పుడే వచ్చి అంటుంది. ఇక అప్పుడే స్వప్న, కాశీ లు వచ్చి డాడ్ ని మేమ్ పిలుస్తామని.. ఎలాగైనా రిసెప్షన్ జరగాలని అంటారు. దంతో దీప కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత స్వప్న, కాశీ లు శ్రీధర్ వాళ్ళ ఇంటికి బయలుదేర్తారు. మనం ఇక్కడ దీపని ఒప్పించాలని అనసూయ, కాంచన ఇద్దరు అనుకుంటారు.

ఆ తర్వాత కాశీ, స్వప్న కలిసి శ్రీధర్ ఇంటికి వెళ్తారు. లోపలికి రావద్దని అంటాడు. కానీ కావేరి లోపలికి పిలుస్తుంది. అన్నయ్య, వదినలకి రిసెప్షన్ చేస్తున్నాం రండీ అని అంటుంది. రానని శ్రీధర్ అంటాడు. మమ్మీ ఎలాగైనా డాడ్ ని తీసుకొని రా అనగానే నేను తీసుకొని వస్తానని కావేరి అంటుంది. ఆ తర్వాత కాంచన, సుమిత్ర లు ఫోన్ మాట్లాడుకుంటారు. నువ్వు కూడా కార్తీక్, దీపల పెళ్లిని తప్పు పడుతున్నావా అని అనగానే.. వాళ్ళని కాదు నిన్ను తప్పు పడుతున్నాను. నువ్వు మీ అన్నయ్య దగ్గర మాట తీసుకున్నావ్.. జ్యోత్స్న ఇంటికి కోడలిని చేసుకుంటానని చిన్నప్పటి అనుకున్నారు. అది ఇప్పుడు కార్తీక్ ని మర్చిపోలేకపోతుందని కాంచనకి సమిత్ర చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.