English | Telugu

Karthika Deepam2 : దీప నా భార్య, శౌర్య నా కూతురు.. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -191 లో.....శివన్నారాయణ‌ కోపంగా వెళ్ళిపోతాడు కానీ సుమిత్ర , కార్తీక్ , దీప లని ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శ్రీధర్, కాంచన, దాస్, అనసూయ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అందరం కలిసి సెల్ఫీ తీసుకుందామని కాశీ ఫోటో తీస్తుంటే.. దీప అక్కడ నుండి వస్తుంది.

ఆ తర్వాత దీప బాధడుతుంటే కార్తీక్ తన దగ్గరికి వస్తాడు. నేను కాంచన అమ్మకి మాటిచ్చానని.. ఆ పూజలో కూర్చున్నానని దీప అంటుంది. వాళ్ళ మాటలన్నీ నాకు చెంప పెట్టులాగా ఉన్నాయి. నా మెడలో తాళి తీసి నన్ను పంపించండని దీప అనగానేమ. అదే నీ కోరిక అయితే ఖచ్చితంగా తీరుస్తానని కార్తీక్ అంటాడు. ఇంత త్వరగా అర్ధం చేసుకుంటారు అనుకోలేదని దీప అంటుంది. నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి.. నా కూతురు రాదని దీపతో కార్తీక్ అంటాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడకే వచ్చారని దీప అనగానే.. నేను శౌర్యకి తండ్రిగా ఉంటాను. నువ్వు నన్ను భర్తగా ఒప్పుకునే వరకు నేను నీకు శ్రేయోభిలాషిగా ఉంటాను. నీ కూతురు కోసం నువ్వు ఉండు అని కార్తీక్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్నని సుమిత్ర కొడుతుంది. ఎందుకు అక్కడికి వెళ్ళావని అంటుంది. రేపు పెళ్లిచూపులు అని శివన్నారాయణ‌ జ్యోత్స్నతో అనగానే.. నా బావే నా భర్త అని చెప్పి జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది.

మరొకవైపు శౌర్య రెండు పిల్లోలని పట్టుకోని.. మీరు ఎప్పుడు ఇలా కలిసి ఉండాలని మాట్లాడుకుంటుంది. అదంతా దీప, కార్తీక్ లు చూస్తుంటారు. చూసావా నీ కూతురు కోసం నువ్వు ఉండు సమాజం గురించి కాదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. కార్తీక్ వాళ్ళతో మాట్లాడుతూ.. ఫోన్ వస్తే బయటకు వెళ్లి మాట్లాడతాడు. అప్పుడే దీప కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి పనిమనిషివా అంటూ అడుగుతారు. అవునని దీప అనగానే.. కాదు తను నా భార్య అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. ఇక తన ఫ్రెండ్ అడుగగా.. శౌర్యని పిలిచిన కార్తీక్.. తను వస్తుంది. "దీప నా భార్య, శౌర్య నా కూతురు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ" అని కార్తీక్ అంటాడు. దాంతో వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.