English | Telugu

Karthika Deepam2 : కార్తీక్, దీపల పూజ.. పెద్దాయన ఆశీర్వాదం ఉందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -190 లో.. దీప, కార్తీక్ ఇద్దరు వ్రతం చేస్తుంటారు. కార్ వచ్చింది. ఆయనే అయి ఉంటారని కాంచన అంటుంది. కానీ వచ్చింది జ్యోత్స్న.. తనని చూసి కాంచన, అనసూయ టెన్షన్ పడతారు. ఈ వ్రతం ఆగకుండా చూడమని అనసూయతో కాంచన అంటుంది. నేను చూసుకుంటానని జ్యోత్స్నకి ఎదురుగా అనసూయ వెళ్లి.. ఇక్కడేం గొడవ చెయ్యకని అంటుంది. అయిన వినకుండా వెళ్తుంటే జ్యోత్స్నని అనసూయ లాక్కొని వెళ్లి గదిలో బందిస్తుంది.

ఆ తర్వాత ఆ విషయం వచ్చి కాంచనకి అనసూయ చెప్తుంది. అపుడే శ్రీధర్ రావడం చూసి కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అప్పుడే శివన్నారాయణ‌ కుటుంబం మొత్తం వస్తారు. వాళ్లని చూసి వీళ్ళు వచ్చారేంటని కాంచన అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీధర్ ని చూసిన సుమిత్ర పలకరించడానికి వెళ్తుంటే.. దశరథ్ ఆపుతాడు. శ్రీధర్ ని శివన్నారాయణ‌ అవమానిస్తాడు. వ్రతం దగ్గరికి వెళ్లి నా మనవరాలు ఎక్కడ అని శివన్నారాయణ‌ అడుగుతాడు. మాకేం తెలుసని కార్తీక్ అంటాడు. బాధపడుతూ ఇక్కడే ఎక్కడో ఉంటుందని వెతుకుతుంటారు. పారిజాతానికి డోర్ కొట్టిన సౌండ్ వినపడడంతో వెళ్లి డోర్ తీసుకొని చూసేసరికి జ్యోత్స్న ఉంటుంది. పూజా ఆపాలి పదా అంటూ పారిజాతాన్ని తీసుకొని వెళ్తుంది.

ఆ తర్వాత పూజ దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. నా బావతో కలిసి దీప ఆశీర్వాదం తీసుకోవడానికి వీలు లేదంటు జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్ కోప్పడతాడు. శివన్నారాయణ‌ కోప్పడి వెళ్లిపోతుంటే.. నా కొడుకు, కోడలిని ఆశీర్వదించండి అని స్వప్నని అక్షింతలు తీసుకొని రమ్మని చెప్తుంది కాంచన. కోపంగా అక్షింతలు శివన్నారాయణ విసిరేయ్యడంతో.. అవి కార్తీక్, దీప లపై పడతాయి. దాంతో శివన్నారాయణ‌ చిరాకుగా వెళ్లిపోతాడు. సుమిత్ర ఇద్దరిని ఆశీర్వదించి వెళ్లిపోతుంది.

తరువాయి భాగంలో అమ్మ,నాన్న కలిసి ఉంటే ఎందుకు ఎవరికి నచ్చడం లేదు కానీ వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను.. ఎప్పుడు ఇలా కలిసి ఉండాలని రెండు పిల్లో(దిండు)లని ఒక దగ్గర పెడుతుంది. అదంతా కార్తీక్, దీప ఇద్దరు చూస్తారు. మన గొడవలు పిల్లలపై పడవద్దు. జనాల కోసం కాకుండా శౌర్య కోసం ఉందామని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.