English | Telugu
Eto Vellipoyindhi Manasu : కొడుకు బర్త్ డే వేడుకల్లో సవతి తల్లి శ్రీలత ఏం చేయనుంది?
Updated : Aug 16, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -176 లో..... సీతాకాంత్ కంపెనీ షేర్ డైరెక్టర్స్ వేరొక కంపెనీకి షేర్ అమ్ముకుంటుంటే.. వద్దని సీతాకాంత్ చెప్పి.. సందీప్ ని చైర్మన్ ని చేస్తానని సంతకం చేయబోతుంటాడు. అప్పుడే నందిని పిఏ వచ్చి సంతకం పెట్టకండి.. మా కంపెనీ మీ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉందని చెప్పగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత పెద్ద కంపెనీ ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతుంటే మేమ్ వేరే దగ్గరికి ఎందుకు వెళ్తాము.. ఇక్కడే ఉంటామని బోర్డు మెంబర్స్ అంటారు.
ఆ తర్వాత సీతాకాంత్ పిఏకీ థాంక్స్ చెప్పగా.. మాకు కాదు చెప్పాలిసింది రామలక్ష్మి గారికి అనగానే.. సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. నువ్వు అనుకున్నది సాధించావ్ అమ్మ అని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ బయటకు వచ్చి.. ఎంప్లాయిస్ కి గుడ్ న్యూస్ అంటూ మన కంపెనీ ఎవరి చేతుల్లోకి వెళ్లట్లేదని చెప్తాడు. అ తర్వాత అందరు వెళ్ళిపోయాక థాంక్స్ రామలక్ష్మి అని సీతాకాంత్ చెప్తాడు. మీరు మంచివారు మంచి వాళ్లకి మంచే జరుగుతుంది సర్.. ఒకావిడ అ రోజు మిమ్మల్ని స్టేషన్ నుండి తీసుకొని రావడానికి హెల్ప్ చేసింది. ఇప్పుడు వచ్చి ఇలా కంపెనీని సేవ్ చేసిందని రామలక్ష్మి అనగానే.. ఎవరు ఆవిడా పేరు తెలుసా అని సీతాకాంత్ అనగానే.. తెలియదు కానీ ఆవిడకి మనకి ఏదో సంబంధం ఉందని రామలక్ష్మి అంటుంది.
అ తర్వాత శ్రీవల్లి తన ఆశలు మొత్తం ఆవిరి అయిపోయాయంటూ బాధపడుతుంది. చివరివరకు వచ్చి ఇలా జరిగిందని సందీప్ అంటాడు. అ తర్వాత సీతాకాంత్, పెద్దాయన మాట్లాడుకుంటుంటే.. అప్పుడే సిరి వచ్చి అన్నయ్య బర్త్ డే కదా.. ఆ సెలెబ్రేషన్స్ లో ఉన్నానని అనగానే.. అయితే నా సెలెబ్రేషన్స్ లో నేను ఉంటానని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి సర్ ప్రైజ్ ఇస్తుంది. కేక్ కట్ చేయిస్తుంది. నాకు జీవితాంతం గుర్తు ఉండి పోయే గిఫ్ట్ ఇవ్వమని సీతాకాంత్ అనగానే.. ఈ రోజు నైట్ లోపు మీకు అలా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తానని రామలక్ష్మి అనగానే.. నా మనసులో మాట కూడా చెప్తానని సీతాకాంత్ అనుకుంటాడు. అ తర్వాత సీతాకాంత్ బర్త్ డే అని తెలుసుకొని ఈ రోజు జీవితాంతం గుర్తు ఉండిపోయేలా చేస్తానని శ్రీలత అనుకొని చేతిలో కర్పూరం వెలిగిస్తూ ఉంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తుంటాడు. తరువాయి భాగంలో బర్త్ డే ఏర్పాట్లు చెయ్యండి అని రామలక్ష్మి పనిమనిషికి చెప్తుంది. బర్త్ డే ఎలా జరుగుతుందో చూస్తానని శ్రీలత అనగానే.. ఈవిడ ఏదో ప్లాన్ చేసిందని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.