English | Telugu
`కార్తీక దీపం` సరికొత్త ట్విస్ట్‌లు.. వంటలక్క దారెటు..
Updated : Nov 13, 2021
స్టార్ మా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `కార్తీక దీపం`. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ రోజుకో మలుపులు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే 1000 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుని 1196వ ఎపిసోడ్‌లోకి ఎంటరైన `కార్తీక దీపం` ఈ రోజు ఎపిసోడ్ రసవ్తర మలుపులు .. ట్విస్ట్‌లకు కేంద్ర బిందువుగా మారబోతోంది.
గత ఎపిసోడ్‌లో దీప .. మోనిత ఇంటికి రావడం.. దీపని అవమానిస్తూ మోనిత కౌంటర్‌లు ఇవ్వడం.. దానికి బదులుగా దీప ఓ రేంజ్‌లో మోనిత వార్నింగ్ ఇచ్చి తనతో ఎందుకు పెట్టుకున్నానా.. ఎందుకు బ్రతికి వున్నానా? అని తల గోడకేసి బాదుకునేలా చేస్తాను నీమీద ఒట్టు` అంటూ దీప .. మోనితకు వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. అయితే ఊహించని విధంగా దీప వార్నింగ్ ఇవ్వడంతో ఏంటీ దీప ధైర్యం ? అంటూ ఆలోచనలో పడుతుంది మోనిత.
కట్ చేస్తే కొత్త నంబర్‌తో డాక్టర్ బాబుకి ఫోన్ చేస్తుంది. తనకు ఫోన్ చేసింది దీప అనుకుని `దీప నువ్వేనా` అంటాడు డాక్టర్ బాబు.. కానీ మోనిత పెద్దగా నవ్వి `నేను కార్తీక్.. నువ్వు నా ఫోన్ ఎత్తకపోతే నా దగ్గర మా ఉద్యోగుల నంబర్లు వేలల్లో వున్నాయి అంటుంది. దీప గురించి అడుగుతూ `ఏంటీ రోజూ దీప తన గురించే అడుగుతోందా? .. లేక తనని తలుచుకుంటూ ఏడుస్తోందా? అని వెటకారంగా అడుగుతుంది. దీంతో డాక్టర్ బాబుకు చిర్రెత్తుకొచ్చి `ఆపు మోనితా` అంటాడు.
దీపని నెత్తికి ఎక్కించుకున్నావో దాన్ని పాతాళానికి తొక్కేస్తాను` అని డాక్టర్ బాబుకు వార్నింగ్ ఇస్తుంది మోనిత. ఆ మాటలు విన్న డాక్టర్ బాబుకు కోపం వచ్చేస్తుంది వెంటనే `మరో మాట మాట్లాడితే మార్యాదగా వుండదు` అంటూనే మోనిత ఫోన్ కట్ చేస్తాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ మరిన్ని ట్విస్ట్‌లు.. మలుపులతో రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.