English | Telugu

ఆనీ ఆట‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్స్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 రోజు రోజుకీ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. అయితే గ‌త సీజ‌న్ తో పోలిస్తే మాత్రం బ‌రింత తాజా సీజ‌న్ అంత ఆస‌క్తిక‌రంగా లేద‌ని నెటిజ‌న్స్ పెద‌వి విరుస్తున్నారు. అంతేనా కంటెస్టెంట్‌ల‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా శుక్ర‌వారం నాటి ఎపిసోడ్‌పై మాత్రం నెటిజ‌న్స్ మ‌రింత‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

69 రోజులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ షో ప‌లు విమ‌ర్శ‌ల‌ని ఎదుర్కొంటోంది. కంటెస్టెంట్‌ల విష‌యంలోనూ వీక్ష‌కుల్ని నిరాశ ప‌రిచిన మేక‌ర్స్ షో నిర్వ‌హ‌ణ విష‌యంలోనూ వీక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నాక‌రంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శుక్ర‌వారం జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల‌పై మాత్రం ఓ రేంజ్‌లో వీక్ష‌కులు దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ మాస్ట‌ర్ ఆనీపై మండిప‌డుతున్నారు. 10వ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా `ట‌వ‌ర్‌లో వుంది ప‌వ‌ర్‌` అనే టాస్క్ ని నిర్వ‌హించారు.

ఈ టా స్క్ కి ఆనీ మాస్ట‌ర్‌ని సంచాల‌కురాలిగా నియ‌మించారు బిగ్‌బాస్‌. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ మొద‌లైంది. సంచ‌లాకులు ఎవ‌రికీ స‌పోర్ట్ చేయ‌కూడ‌ద‌న్న రూల్ వుంది. ఆ రూల్‌ని ప‌క్క‌న పెట్టి ఆనీ త‌న‌ని మొద‌టి నుంచి స‌పోర్ట్ చేస్తున్న ర‌విని స‌పోర్ట్ చేస్తున్న‌ట్టుగా చెప్పేసింది. ఆ త‌రువాత స‌న్నీ.. కాజ‌ల్‌ల‌పై త‌న‌దైన స్టైల్లో ఎదురుదాడికి దిగిన ర‌చ్చ చేసింది. ఫైన‌ల్‌గా ఆనీ హెల్ప్ కార‌ణంట‌గా ర‌వి కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ సంద‌ర్భంగా ఆనీ ప్ర‌వ‌ర్త‌న మ‌రీ ప‌రాకాష్ట‌కు చేరింది. కాజ‌ల్‌తో గొడ‌వ‌.. నాగిన్ డ్యాన్స్‌.. స‌న్నీని క్రిటిసైజ్ చేయ‌డం వంటి సిల్లీ ప‌నుల‌ని చూసి విసుగెత్తిన నెటిజ‌న్స్ ఆనీని ఎర్ర‌గ‌డ్డ పిచ్చాసుప‌త్రికి త‌ర‌లించండి బిగ్‌బాస్ అంటూ మండిప‌డుతున్నారు.