English | Telugu

మోనితను డాక్టర్‌బాబు కలవకుండానే కడుపు ఎలా వచ్చిందంటే..!

మోనిత కడుపులో బిడ్డకు కార్తీక్‌ అలియాస్ డాక్టర్ బాబు. అందులో మరో సందేహానికి తావు లేదు. అయితే, మోనిత మీద కార్తీక్ ఎప్పుడూ మోజు పడింది లేదు. అసలు, ఆమెను కలిసింది లేదు. మోనితను డాక్టర్ బాబు కలవకుండా ఆమెకు గర్భం ఎలా వచ్చింది? అంటే... సోమవారం ప్రసారమైన 'కార్తీక దీపం' ఎపిసోడ్ చూడాలి.

డాక్టర్ బాబు మీద మోజుతో, డాక్టర్ బాబు తనకు దక్కాలని మోనిత చేయని పని లేదు. ఎంత దారుణానికి అయినా ఒడి గడుతుందని ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అయితే, డాక్టర్ బాబు కోసం తాను ఏం చేసినదీ మోనిత చెబుతుంటే నోరెళ్లబెట్టక తప్పదు. అమ్మో... మోనిత చేసిన కుట్రలు, నేరాలు - ఘోరాలు అన్నీ ఇన్నీ కాదు.

హిమ మరణానికి కారణం మోనిత అని తెలిసిన డాక్టర్ బాబు, ఆవేశంగా ఆమె ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు "స్నేహానికి నువ్వే నిదర్శనం అనుకుంటే పాపానికి పరాకాష్ట చూపించావ్. నమ్మక ద్రోహం చేశావ్. నా ప్రేమను దూరం చేశావ్' అని మోనిత మీద డాక్టర్ అరుస్తాడు. బదులుగా తానేం చేసిందీ మోనిత చెప్పడం మొదలుపెట్టింది.

"హిమ చావు గురించి తెలిసే ఇంతిలా షాకయ్యావే. నీ కోసం, నీ ప్రేమ కోసం, నిన్ను నా సొంతం చేసుకోవడం కోసం నీ భార్య దీపను చంపించడానికి దుర్గతో బేరం కుదుర్చుకున్నా. ఆ యాక్సిడెంట్ నువ్వే చేయించావ‌ని దీప అపార్థం చేసుకునేలా చేశా" అని మోనిత చెప్పింది. గతంలో తనను ఎందుకు చంపాలని దీపను త‌ను నిలదీసిన సంగతిని కార్తీక్ గుర్తు చేసుకుంటాడు.

"నిన్ను, నీ భార్యను విడదీయడానికి విహారిని అడ్డం పెట్టుకుని నీలో అనుమానం పెంచా. హిమకు, నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు పిల్లలు పుట్టరని డాక్టర్ తో చెప్పించా. కానీ, దీప గర్భవతి కావడంతో నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆమెను వదిలేశావ్. డెలివరీ సమయంలో దీపకు పాయిజన్ ఎక్కిస్తుంటే దుర్గగాడు వచ్చి లాక్కుని పోయాడు. లేదంటే దీప కూడా ఈపాటికి చచ్చేది" అని తాను చేసిన ఘోరాలను మోనిత బయటపెట్టింది.

కార్తీక్, దీప ఒక్కటై, కాలిపోయి కాపురం మొదలుపెడితే తన ప్రేమ, ఆశలు గంగలో కలిసిపోతాయని గర్భం తెచ్చుకుంది మోనిత. "నీకు పిల్లలు పుడతారా? లేదా? అని ఇచ్చిన సాంపిల్స్ ను నా గర్భంలో ప్రవేశపెట్టుకుని గర్భవతినయ్యా. ఎలాగైతేనేం కార్తీక్... నా కడుపులో బిడ్డకు తండ్రి నువ్వే" అని మోనిత అసలు విషయం బయటపెట్టింది. అన్నీ విన్న కార్తీక్, మోనితను చంపేస్తానని ఆవేశంతో ఊగిపోతాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.