English | Telugu
కేటీఆర్‌ను కలిసిన యాంకర్ ప్రదీప్! రీజన్ ఇదే!!
Updated : Aug 10, 2021
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కలిశారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించిన సేవా కార్యక్రమానికి తనవంతు సాయంగా కొంత ఆర్థిక మొత్తాన్ని అందజేశారు. అసలు వివరాల్లోకి వెళితే...
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించారు. దివ్యాంగులకు వాహనాలు అందించడమే దాని సదుద్దేశం. 'గిఫ్ట్ ఏ స్మైల్'కి ప్రదీప్ మాచిరాజు ఆర్థిక సహాయం చేశారు. "థాంక్యూ సో మచ్ డియర్ కేటీఆర్ గారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా మీరు ఎంతోమందికి స్ఫూర్తి. 'గిఫ్ట్ ఏ స్మైల్' గొప్ప ఇనిషియేటివ్. అందులో మేం ఓ చిన్న భాగం కావడం సంతోషంగా ఉంది" అని ప్రదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కేటీఆర్‌ను ప్రదీప్ కలిసిన సమయంలో ఆయన వెంట వినయ్ బాబు, మరొకరు ఉన్నారు. ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రాన్ని నిర్మించిన ఎస్వీ ప్రొడక్షన్స్ కూడా ఈ ఆర్థిక సహాయంలో పాలు పంచుకున్నట్టు టాక్.