English | Telugu
కిస్ అడిగిన జెస్సీ.. అందరూ చూస్తున్నారంటూనే ముద్దు పెట్టిన సిరి!
Updated : Nov 14, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 పై ఇప్పటికే విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గత సీజన్‌తో పోలిస్తే తాజా సీజన్ చాలా చెత్తగా వుందని.. టాస్క్‌లతో పాటు కంటెస్ట్‌లు వ్యవహరిస్తున్న తీరు.. హోస్ట్‌గా నాగ్ వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. శనివారం ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ సీజన్ 5 పై విమర్శలు మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ వారాంతంతో ఈ షో 10వ వారంలోకి ఎంటరవుతోంది.
ఇదిలా వుంటే ఈ వారం నామినేషన్స్‌లో యాంకర్ రవి, సిరీ, సన్నీ, మానస్, కాజల్ వున్నారు. ఈ ఐదుగురిలో ఎవరు సేవ్ అవుతారు.. ఎవరు హౌస్ నుంచి బయటికి వెళుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గత కొన్ని వారాలుగా చివరి వరకు వచ్చి సేవ్ అవుతూ వస్తున్న కాజల్ ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయం అంటూ సంకేతాలు వినిపించాయి. అందుకు తగ్గట్లే మానస్‌తో పాటు కాజల్ కూడా డేంజర్ జోన్‌లోకి వెళ్లి, ఎలిమినేషన్ అంచుల దాకా వచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అవడం తప్పదని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరినీ బిగ్ బాస్ సేవ్ చేశాడు.
ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. అలా అని ఎవరూ హౌస్ నుంచి బయటకు రాలేదని అనుకోవాల్సిన పనిలేదు. వారం క్రితమే తీవ్ర అనారోగ్యానికి గురైన జెస్సీ.. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తాను హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతున్నానని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే అతడిని పూర్తిగా బయటకు తీసుకురాకుండా సీక్రెట్ రూమ్‌లో ఉంచిన బిగ్ బాస్, అతడికి డాక్టర్లతో పరీక్షలు చేయించాడు. అతనికి స్పెషలిస్టుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ అవసరం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో హౌస్ బయటకు పంపించాల్సి వస్తోందని నాగ్ ప్రకటించారు.
అలా జెస్సీ ఈ వారం హౌస్ నుంచి బయటకు రావడంతో మానస్, కాజల్ ఇద్దరూ ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన జెస్సీ.. స్టేజి మీదకు వచ్చి, ఫోన్‌లో ఒక్కో కంటెస్టెంట్‌తో మాట్లాడి, ఈ వారం ఎవరి గేమ్ ఎలా ఉందో తాను సీక్రెట్ రూమ్ నుంచి గమనించిన విషయాలను వాళ్లతో పంచుకుంటూ, వాళ్లకు సూచనలు అందజేశాడు. సిరిని కిస్ పెట్టమని అడిగాడు. అందరూ చూస్తున్నారని సిరి అంటే, ఫర్వాలేదన్నాడు. ఫోన్‌లోనే జెస్సీకి ముద్దు పెట్టింది సిరి. ఆమెతో జెస్సీ ఎమోషనల్‌గా బాగా కనెక్టయ్యాడని అందరికీ అర్థమైంది. చివరగా షణ్ణుతో మాట్లాడాడు జెస్సీ. క్లోజ్ ఫ్రెండ్‌గా అతనికి సలహాలిచ్చాడు. మొత్తానికి అనారోగ్యంతో జెస్సీ బయటకు వెళ్లడం అందరినీ బాధించింది.