English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఆమెకు నువ్వు అన్యాయం చేశావ్.. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -63 లో.. మాణిక్యాన్ని ఎదిరించి ధనని తీసుకొని వచ్చి పెళ్లి చెయ్యొచ్చు కదా అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ తో అంటాడు. స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని పెద్దాయనకు చెప్తాడు. జాతకం ప్రకారం ఎదిరించి పెళ్లి చెయ్యవద్దు.. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి పెళ్లి చెయ్యాలని స్వామీజీ చెప్పింది పెద్దాయనకి సీతాకాంత్ చెప్తాడు.

అందుకే తాతయ్య ఆ మాణిక్యం ఎన్ని కండిషన్ లు పెట్టినా ఏం అనలేకపోతున్నా అని సీతాకాంత్ పెద్దాయనతో అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి వచ్చి.. అభి వాయిస్ మెసేజ్ చేసాడు ఫారెన్ వెళ్తున్నాడంట, ఒకసారి కలవాలి అంటున్నాడని రామలక్ష్మి చెప్తుంది. మరి వెళ్ళు అంటూ సీతాకాంత్ ఇబ్బందిగా చెప్తాడు. ఇప్పుడు అందరి దృష్టిలో మనం భార్యభర్తలు అలా వెళ్లి మాట్లాడితే.. ఏమైనా అనుకుంటారని రామలక్ష్మి అనగానే.. సరే రేపు వెళదామని సీతాకాంత్ అంటాడు. నువ్వు అభితో మాట్లాడడానికి వెళ్తానంటేనే నాకు ఏదోలా అనిపిస్తుందని సీతాకాంత్ తన మనసులో అనుకుంటాడు..ఆ తర్వాత సీతాకాంత్, రామలక్ష్మి కలిసి మాణిక్యం ఇంటికి వెళ్తారు. అక్కడ రామలక్ష్మి కాపురం గురించి రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత అడిగి తెలుసుకుంటుంది. నాకొక వెయ్యి ఇవ్వని సీతాకాంత్ ని‌ మాణిక్యం అడుక్కుంటాడు. కాసేపటికి బయట నుండి కొంతమంది వచ్చి మాణిక్యం మాకు డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు వస్తారు. మీకెంత ఇవ్వాలి అంటు సీతాకాంత్ అడిగి.. వాల్ల ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు.

ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి ధన వస్తాడు. సిరికి అన్యాయం చేసావంటూ ధనపై రామలక్ష్మి కోప్పడుతుంది. నేను అన్యాయం చెయ్యలేదు.. ఎలాగూ పెళ్లి చేసుకుంటామని అలా చేసామని ధన అంటాడు. ఎలాగైనా మా పెళ్లి చెయ్యాలని ధన అనగానే.. రేపే నీకు సిరికి పెళ్లి అని రామలక్ష్మి చెప్తుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. అవును ఈ విషయం మీ నాన్నకి తెలియొద్దని చెప్తాడు. ఆ తర్వాత వీళ్లేదో ప్లాన్ చేస్తున్నారని మాణిక్యం అనుకుంటాడు. ధన దగ్గరికి మాణిక్యం వచ్చి.. ఏదైనా ప్లాన్ చేస్తే నాకు చెప్పు అని చెప్తాడు. సరే అని ధన అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు అగాలిసిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.