English | Telugu

Karthika Deepam 2 : కార్తీకదీపం-2 లో సూర్యవంశం సీన్.. ఇదేం ట్విస్ట్ మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -198 లో.. కార్తీక్, దీప ఇద్దరు లు కలిసి ఉండాలని శౌర్య కోరుకుంటుంది. మీరు నాకు నచ్చినట్టు ఉండడం లేదు.. నేనంటే ఇష్టం లేదు.. లేదంటే ఫంక్షన్ కి ఒప్పుకునేది కదా అని శౌర్య ఎమోషనల్ అవుతుంటే.. దీప రిసెప్షన్ కి ఒప్పుకుంటుంది.

ఆ తర్వాత రిసెప్షన్ దగ్గరికి వెళ్ళడానికి కాశీ కార్ డెకరేషన్ చేస్తాడు. ఆ తర్వాత కాంచన దగ్గరికి స్వప్న వస్తుంది. జ్యూస్ తాగమ్మ అని ప్రేమగా మాట్లాడుతుంటే.. మీరంటే చాలా ఇష్టం పెద్దమ్మ అంటుంది. స్వప్నని సొంత కూతురులాగా చూస్తున్నారు అమ్మ అని అనసూయ అనగానే.. కూతురే కదా అని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప చీర కట్టుకుంటూ.. స్వప్న రా పిన్ పెట్టాలి అంటుంది. అప్పుడే కార్తీక్ వెనకాల నుండి వచ్చి పిన్ పెడుతాడు. మీరా అని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్ రోజ్ ఫ్లవర్ తీసి ఇచ్చి.. ఇది పెట్టుకోమని అంటాడు. అక్కడ పెట్టండి అని దీప అయిష్టంగా అంటుంటే.. కార్తీక్ తన తలలో పెడతాడు. అంటే మీరు పెట్టమంది అక్కడా.. ఇక్కడ కదా అని కవర్ చేసుకుంటాడు. అప్పుడే స్వప్న వచ్చి.. వదిన రోజ్ ఫ్లవర్ బాగుందని చెప్తుంది. ఆ తర్వాత దీప రోజ్ ఫ్లవర్ ని చూసుకుంటూ ఉంటుంటే కార్తీక్ వెనకాల నుండి చూస్తుంటాడు.

ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న లు రిసెప్షన్ దగ్గరికి వెళ్లి చెడగొట్టాలని అనుకుంటారు. అప్పుడే సుమిత్ర గుడికి వెళ్తున్నా మావయ్య అని శివన్నారాయణకి చెప్తుంది. సరే అంటాడు. సారీ మావయ్య మీకు అబద్దం చెప్పాను రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నానని మనసులో అనుకుంటుంది సుమిత్ర. ఆ తర్వాత పారిజాతం దగ్గుతు.. శివన్నారాయణ‌ దగ్గరికి వస్తుంది. దాంతో పదా హాస్పిటల్ కి వెళదామని అంటాడు. మీరు ఎందుకని పారిజాతం అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి.. నేను తీసుకొని వెళ్తానంటూ ఇద్దరు బయటకు వస్తారు. ఈ సీన్ చూస్తుంటే వెంకటేష్, మీనా, రాధిక నటించిన 'సూర్యవంశం' సినిమాలో ని ఓ సీన్ లా అనిపిస్తుంది.

ఆ తర్వాత దీప, కార్తీక్ లు అందరు రిసెప్షన్ దగ్గరికి బయలుదేర్తారు. రిసెప్షన్ దగ్గరికి కావేరి, శ్రీధర్ లు వస్తారు. శ్రీధర్, స్వప్న లు కోపంగా మాట్లాడుకుంటారు. నీ తండ్రితో అలాగేనా మాట్లాడేది అని స్వప్నని కావేరి కోప్పడుతుంది. ఆ తర్వాత అందరు లోపలకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.