English | Telugu

యాంక‌ర్ ర‌విని అడ్డంగా బుక్ చేసిన కాజ‌ల్

బిగ్‌బాస్ సీజ‌న్ 5లో యాంక‌ర్ ర‌వి మైండ్ గేమ్ ఆడుతూ ఇంటి స‌భ్యుల్ని ఒక్కొక్క‌రి బ‌య‌టికి పంపిస్తూనే వున్నాడు. తాజాగా ఇదే ఫార్ములాని స‌న్నీపై ఉప‌యోగించాల‌ని శ్రీరామ చంద్ర‌తో క‌లిసి ర‌వి ప్ర‌య‌త్నాలు బ‌మొద‌లుపెట్టాడు. అయితే ఆ ప్ర‌య‌త్నాలేవీ స‌న్నీ విష‌యంలో ఫ‌లించ‌డం లేదు. కార‌ణం అత‌నికి అండ‌గా మాన‌స్‌, కాజ‌ల్ వుండ‌టం.. స‌న్నీ త‌న గేమ్‌ని సిన్సియ‌ర్‌గా ఆడుతుండ‌టం. మ‌రో నాలుగు వారాల్లో సీజ‌న్ 5 ఎండ్ కానున్ర‌న నేప‌థ్యంలో హౌస్‌లో రాజ‌కీయాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

ఇంటి నుంచి ఎవ‌రిని బ‌య‌టికి పంపిస్తే టైటిల్ రేసులో మిగ‌తా వారికి అడ్డు లేకుండా పోతుంద‌ని ఎవ‌రికి వారు ఎత్తుల‌కు పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యాంక‌ర్ ర‌వి మ‌రోసారి అడ్డంగా దొరికిపోయాడు. గ‌త కొన్ని వారాలుగా కంటెస్టెంట్‌ల‌ని త‌న‌దైన ఎత్తుల‌తో చిత్తు చేస్తూ బ‌య‌టికి పంపిస్తున్న ర‌వి ఈసారి కాజ‌ల్‌కు అడ్డంగా దొరికిపోయాడు. హౌస్‌లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ చెప్పిన‌ట్టు గుంట‌న‌క్క‌లా మారిన ర‌వి ఒక‌రి గురించి మ‌రొక‌రికి చెప్పడం.. ఇక్క‌డి మాట‌లు అక్క‌డ అక్క‌డి మాట‌లు ఇక్క‌డ చెబుతూ ఇంటి స‌భ్యుల‌తో ఆడుకుంటూ కొంత మంది ఎలిమినేట్ కావ‌డానికి కార‌ణంగా మారుతున్నాడు.

ఇప్ప‌టికే గుంట‌న‌క్క అన్న పేరున్న ర‌వికి స‌న్నీ తాజాగా నార‌దుడు అనే పేరు పెట్టేశాడు. అంతేనా సోమ‌వారం జ‌రిగిన నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ర‌విపై ఫైర్ అయిన స‌న్నీ హౌస్‌లో వున్న వ్య‌క్తుల్లో పేక్ ఎవ‌రైనా వున్నారంటే అది నువ్వే అంటూ ముఖం మీదే చెప్పేశాడు. ఇదే సంద‌ర్భంగా కాజ‌ల్ కూడా ర‌విని, శ్రీ‌రామ‌చంద్ర‌ల‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంది. సిరి, ష‌న్ను ఒక‌రికి ఒక‌రం ఆడాల‌ని ముందే అనుకుని ఇక్క‌డికి వ‌చ్చార‌ని, ఇక్క‌డికి వ‌చ్చాక జ‌న్యూన్‌గా క‌నెక్ట్ అయ్యార‌ని ర‌వి చెప్పాడ‌ని శ్రీ‌రామ‌చంద్ర‌ని అడ‌గ‌డం మ‌ధ్య‌లోకి న‌న్ను లాగ‌కంటూ శ్రీ‌రామ‌చంద్ర ఎస్కేప్ కావండంతో సిరి, ష‌న్ను విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేసి ర‌వి అడ్డంగా బుక్క‌య్యాడ‌ని, అత‌ను బుక్క‌య్యేలా కాజ‌ల్ చేసింద‌ని నెటిజ‌న్స్ సెటైర్లు వేస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.