English | Telugu

Jyothirai : ఎవరితోనో అలా చేసి..ప్రూ చేసుకోవాల్సిన అవసరమేమీ లేదు!

తెలుగు టీవీ సీరియళ్ళలో బాగా క్రేజ్ తెచ్చుకున్న సీరియల్ గుప్పెడంత మనసు( Guppedantha Manasu). ఈ సీరియల్ లో రిషి, వసుధారల జోడీ ఎంత ఫేమసో.. రిషి తల్లిగా చేసిన జగతి మేడమ్ పాత్ర కూడా అంతే ఫేమస్. జగతి పాత్రలో చేసిన జ్యోతిరాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ తాజాగా ఓ ఫేక్ వీడియో లీక్ అంటు వైరల్ గా మారింది. ఇక గత కొన్ని రోజులుగా తను బిగ్ బాస్ కి వెళ్తుందంటు వార్తలొస్తున్నాయి. వాటన్నింటికి సమధానాలని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

గుప్పెడంత మనసు సీరియల్‌తో తన అనుబంధం చాలా బలమైనదని, ఈ సీరియల్‌లో జగతి పాత్ర చేయడానికి చాలా మంది నిరాకరించారు. కానీ నేను ఓ ఛాలెంజింగ్‌గా తీసుకొని నా కంటే వయసులో పెద్ద తరహా పాత్రను పోషించాను. అది ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చింది. ఒక సినిమా అంటే రెండు, మూడు నెలలు మాత్రమే షూటింగ్ ఉంటుంది. కానీ సీరియల్ షూటింగ్ అంటే కొన్నేళ్ల పాటు వాళ్లతో ప్రయాణించాలి. అలా గుప్పెడంత మనసు టీమ్ మొత్తం నా ఫ్యామిలీ అయిపోయింది. జగతి పాత్రను ఎంతలా అభిమానించారో అదే తరహాలో నా సినిమాలు, ప్రాజెక్టులను ఆడియన్స్ ఆదరించాలని కోరుతున్నానంటూ జ్యోతి రాయ్ చెప్పింది.

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ చాన్నాళ్లుగా వస్తున్న వార్తలపై జ్యోతిరాయ్ స్పందించింది. నేను బిగ్‌బాస్‌లోకి రావడం లేదు.. అసలు ఈ న్యూస్ ఎవరు వైరల్ చేస్తున్నారే తెలీడం లేదు.. అయినా ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు నాతో పాటు చాలా మందిపై ఇలాంటి వార్తలు వేసి బతుకుతున్నారు. నేను అని కాదు వాళ్ల న్యూస్ కోసం ఎవరో ఒకరి బలి చేయాలి అంతే. ఇలాంటి గాసిప్స్‌ను నేను అసలు కేర్ చేయను. జనాలు దయచేసి ఏదైనా మా నోటి నుంచి వస్తేనే నమ్మండి. అది ఏ విషయమైనా సరే మేము చెబితేనే నమ్మండి. ఎందుకంటే ఈ యూట్యూబర్లు ఏమీ నా పేరెంట్స్, నా బ్రదర్స్ ఏమీ కాదు.. అయినా ఎవరి గురించి ఎవరూ మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలా వాళ్లు ఎలా మాట్లాడతారు అసలు. కన్నడ బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చింది.. అది నిజమే. కానీ నాకు ఈ సెప్టెంబర్ నుంచి వరుసగా ప్రాజెక్టులు ఉన్నాయి. యాక్టింగ్ నా కెరీర్. అంతేకానీ ఒక నాలుగు గోడల మధ్యలో ఎవరితోనో గొడవ పెట్టుకొని, ఏదో మాట్లాడుతూ నన్ను నేను ప్రూ చేసుకోవాల్సిన అవసరమేమీ లేదు. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. గనుక నా మొదటి ప్రిఫరెన్స్ ఎప్పుడూ అదేనంటూ జ్యోతి క్లారిటీ ఇచ్చింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.