English | Telugu
అల్లు అర్జున్ అంటే పిచ్చి..ఆయనతో కలిసి పని చేయాలనీ ఉంది
Updated : Aug 27, 2024
గుప్పెడంత మనసు సీరియల్ హీరోకి పుష్ప అంటే చాలా ఇష్టమంట..ఇష్టం మాత్రమే కాదు పిచ్చి అంట. పుష్ప అలియాస్ అల్లు అర్జున్ అంటే తనకు ఇన్స్పిరేషన్, పిచ్చి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు రిషి సర్ అలియాస్ ముకేశ్ గౌడ. "మా గుప్పెడంత మనసు షూటింగ్ జరిగే దగ్గర సారధి స్టూడియోస్ లో పుష్ప మూవీ క్లైమాక్స్ సీన్ షూటింగ్ జరుగుతోంది. నేను ఆ రోజు ఉదయం సీరియల్ షూటింగ్ కోసం నా లొకేషన్ కి వచ్చాను. అక్కడ నా కార్ దిగగానే ఎదురుగా AA అనే పేరుతో ఒక క్యారవాన్ కనిపించింది. దాని చూడగానే నాకు ఏదో ఐపోయింది.
ఇక్కడ అల్లు అర్జున్ ఉన్నారా అని షాక్ అయ్యా. ఐతే నాకు ఆయన్ని ఎలాగైనా చూడాలని అనిపించింది. నిజం చెప్పాలంటే ఆయనతో కలిసి పని చెయాలని ఉంది. ఆయన్ని చూసేసరికి నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఐతే ఆయన చుట్టూ ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారు. దాంతో ఆయన బయటకు వచ్చే ఆప్షన్ ఐతే లేదు. ఇక నేను కూడా ఆయన్ని చూసే అవకాశం రాదు అనుకుని వెళ్ళిపోయాను. సీన్ షూట్ కోసం మేకప్ వేసుకుని రెడీ అయ్యాను. అలా షూటింగ్ కి నేను నా అసిస్టెంట్ వెళ్తున్నాం..అక్కడికి ఇంకా ఎవరూ వచ్చే అవకాశం కూడా లేదు. అదే టైములో క్యారవాన్ డోర్ ఓపెన్ అయ్యింది. అదే టైంకి అల్లు అర్జున్ కూడా సీన్ షూట్ కోసం రెడీ అవుతున్నారు. అంతే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఆయనని అలా చూసేసరికి. అది ఒక మంచి మెమరీ లాగా నా మనసులో నాటుకుపోయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా నాకు ఇన్స్పిరేషన్ గా ఉంటారు. తెలుగు ఇండస్ట్రీ గురించి యాక్టర్స్ గురించి చిన్నప్పుడు నాకు పెద్దగా తెలీదు. కానీ మెగాస్టార్ గురించి తర్వాత నేను చాల తెలుసుకున్న..ఆయన జీవితం గురించి తెలుసుకున్నాక ఆయనకు కూడా నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను" అని ఎన్నో విషయాలు చెప్పాడు ముకేశ్ గౌడా.