English | Telugu

తార‌క్‌ అసహ్యంగా ఉన్నాడన్న రాజమౌళి!

బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్లకు యంగ్ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ ఒక ఇన్స్పిరేషన్. 'రాఖీ' సినిమా వరకూ తార‌క్‌ లావుగా ఉండేవారు. తర్వాత 'యమదొంగ' కోసం సన్నబడ్డారు. 'కంత్రి'లో మరీ సన్నగా కనిపించారు. లావుగా ఉన్నప్పటికీ డ్యాన్సులు ఇరగదీసేవారు. యాక్టింగ్ అదరగొట్టేవారు. ప్రేక్షకులను మెప్పించారు. అయితే, ఉన్నట్టుండి తార‌క్ బరువు తగ్గడానికి కారణం ఎవరో తెలుసా? దర్శక ధీరుడు, తార‌క్‌ ముద్దుగా "జక్కన్న" అని పేరు పెట్టిన రాజమౌళి.

"నేను చాలా లావుగా ఉండేవాడిని. అయినా ఏ రోజూ నేను లావుగా ఉన్నానని అనిపించలేదు. ఒక రోజు జక్కన్న, 'అసహ్యంగా ఉన్నారు' అని అన్నారు. ఆ రోజు కొంచెం వెలిగింది. ఎందుకంటే... మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్... వాళ్లే పర్ఫెక్ట్ గా గైడ్ చేస్తారు. ఆ రోజు నుండి వెయిట్ తగ్గే ప్రయత్నం చేశా. తగ్గా" అని 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమంలో జూనియ‌ర్‌ ఎన్టీఆర్ చెప్పారు.

సినిమాల్లోకి రావాలని అనుకుంటున్న కంటెస్టెంట్‌తో నిజాయతీగా ఉండమని తార‌క్‌ సలహా ఇచ్చారు. మనకు చాలా తెలుసు అని అనుకుంటామని, కానీ ఏమీ తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.