English | Telugu

లాస్య‌కు తుల‌సి ఇచ్చిన మాట ఏంటీ?

బుల్లితెర‌పై ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతున్న సీరియ‌ల్ `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`. కస్తూరి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వ‌రాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ గురువారం 492వ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోబోతున్నాయి. అవేంట‌నేది ఒక‌సారి చూద్దాం. గ‌త ఎపిసోడ్‌లో లాస్య `వెల్‌నెస్ సెంట‌ర్‌`కి వ‌చ్చి నందుని క‌డిగిపారేసిన విష‌యం తెలిసిందే.

`నీకు నేను కావాలో లేక తుల‌సి కావాలో తేల్చుకో.. తులసిని న‌న్ను బాధ‌పెడుతున్నావ్‌.. మా ఇద్ద‌రిలో ఎవ‌రు కావాలో ఇప్ప‌టికైనా తేల్చుకో` అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఏమీ మాట్లాడ‌లేక నందు బోరుమంటాడు. అదే స‌మ‌యంలో వాట‌ర్ బాటిల్ అందిస్తూ `ఆంటీ మిమ్మ‌ల్ని తుల‌సి ఆంటి పిలుస్తోంది` అంటుంది అంకిత‌. వెంట‌నే `నేను రాను అని చెప్పు అంటుంది లాస్య‌. `మ‌న‌ల్ని క‌ల‌వాలి అనుకునేవారిని క‌ల‌వ‌క‌పోతే మ‌నం చాలా కోల్పోతాం` అంటుంది అంకిత‌. దాంతో లాస్య మ‌న‌సు మార్చుకుని తుల‌సి ద‌గ్గ‌రికి వెళుతుంది.

మ‌న మ‌ధ్య ఇదంతా జ‌రిగి వుండ‌క‌పోతే మ‌నం మంచి ఫ్రెండ్స్ అయ్యే వాళ్ల‌మేమో లాస్య. కానీ నిన్ను నేను ఫ్రెండ్ లాగే అనుకున్నాను. నందుకి న‌టించ‌డం రాదు. ఇక నందు నా జీవితంలోకి రావ‌డం సాధ్యం కాదు. అంటుంది తులసి. నందు అనే వ్య‌క్తి ఇక నుంచి లాస్య‌తోనే క‌లిసి బ‌త‌కాలి.. అలా జ‌రిగేలా నేను చేస్తాను` అంటూ లాస్య‌కు తుల‌సి మాటిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. నందు డాక్ట‌ర్ అద్వైత కృష్ణ‌పై ఎందుకు సీరియ‌స్ అయ్యాడు? .. తుల‌సి ప‌రిస్థితి ఏంటీ.. ఆమె క‌థ ఏ మ‌లుపు తీసుకుంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.