English | Telugu

Jayam serial : గంగకి బాక్సింగ్ కోచ్ గా రుద్ర.. శకుంతల డ్రామా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -105 లో.....గంగ తన కాలికి పెన్ తో పట్టీల డిజైన్ వేసుకొని మురిసిపోతుంది. పాపం రుద్ర సర్ తనకి గిఫ్ట్ రిటర్న్ ఇచ్చినందుకు ఫీల్ అయిండెమో అని గంగ అనుకుటుంది. మరొకవైపు పారుని ఇషిక, వీరు కలుస్తారు. రుద్ర పెళ్లికి ఒప్పుకున్నాడు కానీ నీతో అని తెలియదని ఇషిక చెప్తుంది.

మరుసటి రోజు ఉదయం శకుంతల త్వరగా లేచి పూజ చేస్తుంది. రుద్ర వెళ్తుంటే అగు నాన్న అని కూర్చొపెట్టి నీకోసమే పూజ చేసాను అకాడమీ సక్సెస్ అవుతుంది. ఈ రక్ష కట్టుకోమని కడుతుంది. పాయసం తినిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం కి భోజనం కూడా పంపిస్తుంది. అదంతా చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. పెద్దసారు మాత్రం ఇదంతా నీ నటన ఏమోనని భయంగా ఉంది శకుంతల అని అనుకుంటాడు. రుద్ర అకాడమీకి వెళ్తుంటే శకుంతల ఎదురువస్తుంది. ఆ తర్వాత మన ప్లాన్ సక్సెస్ అని ఇషిక, వీరు అనుకుంటారు. మరొకవైపు రుద్ర అకాడమీ వెళ్తాడు. అక్కడ ప్రాక్టీస్ కి దీప్తి రాదు.. ఎందుకు రాలేదో కనుక్కోమని రుద్ర కోచ్ కి చెప్తాడు. అప్పుడే పారు వచ్చి ఇక దీప్తి ఇక్కడికి ఎప్పటికి రాదు.. రాకుండా చేసానని చెప్తుంది.

ఇప్పుడు నువ్వు సెలక్షన్ కి ఎవరిని పంపిస్తావ్.. అసలు స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరున్నార‌ని పారు అంటుంది. నేనున్నానని గంగ ఎంట్రీ ఇస్తుంది. నువ్వా అంటూ పారు వెటకారంగా నవ్వుతుంది. దాంతో గంగ ఫోర్స్ గా తన మొహంపై పంచ్ ఇవ్వబోతు ఆగుతుంది. దాంతో పారు భయపడుతుంది. నాకు ట్రైనింగ్ ఇవ్వండి రుద్ర సర్ మీ నమ్మకం నిలబెడతానని రుద్రతో గంగ అంటుంది. తరువాయి భాగంలో శకుంతల చూసిన అమ్మాయి పారు అని రుద్రతో పాటు ఇంట్లో అందరికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.