English | Telugu
బిగ్ బాస్ 7 లోకి అబ్బాస్ ఎంట్రీ!
Updated : Aug 23, 2023
ప్రస్తుతం చాలా మంది సీనియర్ హీరోలు, హీరోయిన్స్ మొదట ఇన్నింగ్ పూర్తి చేసుకొని రెండవ ఇన్నింగ్ ని మొదలు పెడుతున్నారు. అయితే ఇందులో కొంతమంది బిగ్ బాస్ ని ఒక ప్లాట్ ఫామ్ గా ఉపయోగించుకుంటున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకొని వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు అదే కోవలోకి చేరబోతున్నారు హీరో అబ్బాస్. హీరో అబ్బాస్ 90's లో తన సినిమాలతో అందరికి సుపరిచితమే. చాలా సినిమాల్లో నటించి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు.
అబ్బాస్.. తెలుగు, తమిళ్ కన్నడలో సినిమాల్లో చేసి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల పక్కన నటించి అందరిని మెప్పించాడు అబ్బాస్. విలక్షణ నటనతో తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు అబ్బాస్. ' ప్రేమదేశం ' సినిమాలో హీరో వినీత్, టబులతో నటించి మెప్పించాడు. ప్రేమదేశం సినిమా అబ్బాస్ కెరీర్ లో హిట్ మూవీగా నిలిచింది. ఆ సినిమా ద్వారానే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు అబ్బాస్. ప్రియ ఓ ప్రియా, రాజహంస, రాజా, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణబాబు, అల్లుడుగారు వచ్చారు, నీ ప్రేమకై, నరసింహ.. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బాస్ నటించిన సినిమాల జాబితా బోలెడుంది.
గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అబ్బాస్.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అబ్బాస్ బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక వేళ అబ్బాస్ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టినట్లే అబ్బాస్. అయితే ఇది ఎంత వరకు నిజమనే విషయంపై క్లారిటీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోసారి అబ్బాస్ స్క్రీన్ మీద కనిపించి ఇంప్రెస్ చేస్తాడో లేదో చూడాలి మరి!