English | Telugu
ఫేక్ అకౌంట్స్ నడుపుతున్న భాస్కర్
Updated : Oct 29, 2025
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ఫుల్ కామెడీగా ఉంది. శాంతి స్వరూప్ పట్టు చీర కట్టుకుని వచ్చేసరికి రాంప్రసాద్ వెంటనే "శారీ మాత్రం చాలా బాగుందమ్మా" అన్నాడు. దాంతో "మా మావయ్య ఆయన చేతుల మీద పట్టు చీర కొట్టాడు. ఈ చీర కోసం 100 పట్టు పురుగులు చచ్చాయి" అన్నాడు. దాంతో దొరబాబు "ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయా" అంటూ శాంతి స్వరూప్ మీద సెటైర్ వేసాడు. ఇక ఫైనల్ లో బులెట్ భాస్కర్, ఫైమా స్కిట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. "ఏవండీ ఈ రోజు నైట్ కి ములక్కాడ చారు చేయమంటారా, ములక్కాయ పులుసా " అని అడిగింది. "వద్దు, వద్దు, వద్దు" అన్నాడు భాస్కర్.
"ఎందుకండీ" అంటూ ఫుల్ ఫెయిర్ అయ్యింది. "అవి తిన్న తర్వాత తిట్టించుకునేకన్నా తినకముందు తిట్టించుకోవడం మంచిది" అన్నాడు. ఇక వర్ష వచ్చింది. ఆమె ముందు నాటీ నరేష్ తెగ కుప్పిగంతులు వేసి ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేసాడు. "కాఫీ పెట్టుకుని తీసుకునిరా" అన్నాడు నరేష్. "నేను కాఫీ తేను" అని చెప్పింది వర్ష. "ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్" అన్నాడు నరేష్. "ఏంట్రా" అని వర్ష ఫైర్ అయ్యేసరికి " ఏంటే నరుకుతా. మొగుడంటే ఏళాకోళంగా ఉందా, ఎకసెక్కాలుగా ఉందా" అన్నాడు. "నువ్వున్నది ఇంతా నీ ఆరుపెంట్రా ఇంత ఉంది" అంటూ వర్ష కౌంటర్ వేసింది.
ఇంతలో భాస్కర్ వచ్చాడు. "ఎంత ఉన్నామన్నది కాదు అరిపించామా లేదా అన్నది ముఖ్యం" అన్నాడు నరేష్. ఇంతలో భాస్కర్ వచ్చాడు.."నాటీ నరేష్ పేరుతో ఫేస్ బుక్ లో నాలుగు ఫేక్ అకౌంట్స్ పెట్టి 40 మంది అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నాను. కొట్టుకు చచ్చిపోతున్నారు సర్ ఆడోల్లు మీకోసం అక్కడ" అంటూ ఆడియన్స్ గా వచ్చిన కాలేజ్ గర్ల్స్ ని చూపించాడు. దాంతో వాళ్లంతా వచ్చి నరేష్ ఆడిపాడారు. అందులో ఒక కాలేజీ గర్ల్ ఐతే మనిషి చిన్నోడే ఐనా మనసు చాలా పెద్దది అంటూ హార్ట్ సింబల్ చూపించింది నరేష్ కి.