English | Telugu
Bigg Boss 9 Telugu : నిఖిల్ నామినేషన్ తో తనూజ షాక్.. దివ్య పాపం!
Updated : Oct 29, 2025
బిగ్ బాస్ సీజన్-9 ఎనిమిదో వారానికి చేరుకుంది. సోమవారం మొదలైన నామినేషన్ ప్రక్రియ నిన్నటివరకు ఆసక్తికరంగా సాగింది. నామినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనని చూసి దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి భరణిని హగ్ చేసుకుంటుంది. భరణిని చూసి తనూజ ఎమోషనల్ అవుతుంది. కట్టప్పా వచ్చాను.. అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచావు.. మహేంద్ర బాహుబలి వచ్చాడని ఇమ్మాన్యుయల్ తో భరణి అంటాడు. భరణి తన మొదటి నామినేషన్ సంజనని చేస్తాడు. మీరు మాట్లాడే మాటలు ఇతరులని హర్ట్ చేసే విధంగా ఉన్నాయి. హరీష్ ఒక మాట ఏదో అన్నందుకు బాడీ షేమింగ్ అన్నారు.. మరి మీరు చేస్తోంది ఏంటి? కెప్టెన్ ని ఇష్టం వచ్చినట్లు మాటలు అనొచ్చా అని భరణి తన పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్పాడు.
రెండో నామినేషన్ కి నాకు ఛాన్స్ ఇవ్వండి అని భరణిని దివ్య అడుగుతుంది. అది పట్టించుకోకుండా నిఖిల్ కి ఇస్తాడు భరణి. దాంతో దివ్య బాధపడుతుంది. తనూజని నిఖిల్ నామినేట్ చేస్తాడు. కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మాన్యుయల్ మీరున్నప్పుడు.. నాకు ఛాన్స్ ఇవ్వండి అని బెగ్గింగ్ చేసావ్.. అలా చెయ్యొచ్చా.. ఆడాలి కదా.. రేపు ట్రోఫీ విషయంలో కూడా ఇలాగే చేస్తావా అని తనూజతో నిఖిల్ ఆర్గుమెంట్ చేస్తాడు.
అసలు ఇన్ని రోజులు మీరేం ఆడారని తనూజ అడుగగా అసలు మీరేం ఆడారుని నిఖిల్ అంటాడు. నేను ఆడాను కాబట్టి ఇక్కడున్నానని తనూజ అంటుంది. అయితే కెప్టెన్ బోర్డులో మీరు లేరు కదా అని నిఖిల్ వెటకారంగా మాట్లాడతాడు. చూస్తావేమో త్వరలో అని తనూజ అంటుంది. ఆ తర్వాత భరణి నామినేషన్ అనంతరం వెళ్లిపోతుంటే భరణి దగ్గరికి తనూజ వచ్చి నా వాళ్లే మీరు బయటకు వెళ్లిపోయారా అని అడుగుతుంది. అదేం లేదు మంచిగా ఆడమని తనూజకి చెప్తాడు. దివ్యని అసలు పట్టించుకోకపోవడంతో తను ఫీల్ అవుతుంది. మరి దివ్య, భరణి కలిసారా..లేక ఆ గ్యాప్ ని దివ్య అలానే మెయింటేన్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.