English | Telugu
లవ్ ట్రాక్ లో సుధీర్...స్మైల్ తో పడేశాడుగా!
Updated : Oct 29, 2025
ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వారం ఈ ఎపిసోడ్ కి "రౌడీ గర్ల్స్ వెర్సెస్ రౌడీ బాయ్స్ " కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇక ఢీ డాన్సర్ పండు ఐతే సై మూవీలో భిక్షు యాదవ్ గెటప్ లో ముక్కుకు రింగు పంచెతో వచ్చాడు. ఇక అష్షు రెడ్డి వచ్చి భిక్షు యాదవ్ అనేసరికి "గట్టిగా కొడితే బిక్కు బిక్కు మంటూ ఏడుస్తాడు వీడు భిక్షు యాదవా" అంటూ సుధీర్ పండు మీద సెటైర్ వేసాడు. తర్వాత కావ్య బ్లాక్ శారీలో క్రాక్ మూవీలో జయమ్మ గెటప్ లో వచ్చింది. "జయమ్మ నీ గుండెల్లో కత్తి దింపుతా" అంటూ చేతిలో కత్తి తీసుకుని వచ్చి సుధీర్ ని బెదిరించింది. "నీకే ప్రమాదం" అన్నాడు సుధీర్. ఏ అని కావ్య అడిగేసరికి "అక్కడ ఉన్నది మీరే కదా మరి" అంటూ రొమాంటిక్ డైలాగ్ చెప్పేసరికి కావ్య నవ్వు ముఖం పెట్టింది. ఇక రియాజ్ ఐతే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో అమ్రిష్ పూరి గెటప్ వేసుకుని వచ్చాడు. ఇక ఫైనల్ లో సౌమ్యశారదా నరసింహ మూవీలో రమ్యకృష్ణ అలియాస్ నీలాంబరి గెటప్ లో బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చింది.
"నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతా అనే ఒకే లవ్ ట్రాక్ తో అందరినీ బకరా చేసావే ఆ ట్రిక్ నాకు బాగా నచ్చింది...అన్నా ఏయ్ అన్నా ఏయ్ అని నీ ఫాన్స్ చెప్తున్నప్పుడు అందరితో వేసిందంతా వేసి అయ్యో నాకేం తెలీదురా బాబు అని ఒక దొంగ స్మైల్ ఇస్తావే ఆ స్మైల్ నాకు బాగా నచ్చింది" అంటూ చెప్పిన డైలాగ్స్ కి సుధీర్ పడీపడీ నవ్వాడు. ఇక తర్వాత షోలో ఉన్న వాళ్లందరితో గేమ్స్ ఆడించాడు.