English | Telugu
Illu illalu pillalu : భద్రవతి కబ్జా చేసిన భూమిని సీజ్ చేసిన నర్మద.. రచ్చ రచ్చ!
Updated : Nov 4, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -307 లో..... అమూల్యకి విశ్వ ప్రపోజ్ చేస్తాడు. దాంతో ఒరేయ్ ఎంత ధైర్యంరా నీకు.. ఇప్పుడే వెళ్లి ఈ విషయాన్ని మా నాన్నతో చెప్తానని అమూల్య కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. అదంతా చుసి విశ్వ దగ్గరికి శ్రీవల్లి వస్తుంది. బండోడా ఎంత పని చేసావ్ రా అని అడుగుతుంది.. నేనేం చేశాను ప్రపోజ్ చేసానని విశ్వ అంటాడు.
ఆ తర్వాత పని మీద రామరాజు రెండు రోజులు పక్క ఊరుకి వెళ్తాడు. దాంతో వేదవతి ఏడుస్తుంది. ఏంటి అక్కా.. బావ వెళ్ళేది పక్క ఊరుకి అది రెండు రోజులే.. ఆ మాత్రానికి నువ్వు ఇంతలా చెయ్యాలా అని తిరుపతి అంటాడు. మరొకవైపు ప్రేమ, ధీరజ్ ఇద్దరు గ్రౌండ్ కి వచ్చి రన్నింగ్ లో పోటీపడతారు. అందులో ప్రేమ గెలుస్తుంది. ఇప్పుడు ఒప్పుకుంటావా పోలీస్ డిపార్ట్ మెంట్ కి పర్ఫెక్ట్ అని ప్రేమ అంటుంది.. మరి ట్రై చేయ్యొచ్చు కదా అని ధీరజ్ అంటాడు. డ్యాన్స్ క్లాస్ చెప్తానంటేనే మావయ్య ఒప్పుకోలేదు.. అలాంటిది దీనికి ఒప్పుకుంటాడా వదిలేయ్ అని ప్రేమ అనగానే నీ కల నేను నెరవేరుస్తానని ధీరజ్ అనుకుంటాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు.
మరొకవైపు అమూల్య వాళ్ళ నాన్నకి చెప్పడానికి ఇంటికి వస్తుంది. శ్రీవల్లి ఆపి ఈ రెండు కుటుంబాల్లో గొడవలు జరగడం ఎందుకని అమూల్యని డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత భద్రవతి అక్రమంగా భూమి కబ్జా చేసిన వాటిని నర్మద సీజ్ చేస్తుంది. ఆ విషయం తెలియడంతో భద్రవతి, సేనాపతి వచ్చి ఇద్దరు నర్మదతో గొడవపెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.