English | Telugu
Karthika Deepam2 : దీపని సొంతకూతూరిలా చూసుకుంటున్న దశరథ్, సుమిత్ర.. హర్ట్ అయిన జ్యోత్స్న!
Updated : Nov 4, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -506 లో..... సుమిత్ర వచ్చి జ్యోత్స్నతో మాట్లాడుతుంది. సుమిత్ర మాటలు జ్యోత్స్నకి చెంపపెట్టులాగా అనిపిస్తాయి. ఇప్పటివరకు మీ అమ్మ మాట్లాడిన విధానం చూస్తుంటే త్వరలోనే అసలైన వారసురాలు ఎవరో తెలుసుకొని నిన్ను ఇంట్లో నుండి గెంటెస్తారనిపిస్తుందని జ్యోత్స్నతో పారిజాతం అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇంకా బయపెట్టకు గ్రానీ అని తనపై జ్యోత్స్న కోప్పడుతుంది. ఇక ఆ తర్వాత అందరు భోజనానికి కూర్చొని ఉంటారు.
పారిజాతం వచ్చి శివన్నారాయణ పక్కన కూర్చోబోతుంటే.. వద్దు అటువైపు కూర్చొ అంటాడు. దీప, కార్తీక్ మీరు కూడా కూర్చోండి. ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీరే అని శివన్నారాయణ అంటాడు. నాదొక రిక్వెస్ట్ సుమిత్ర.. మన మధ్యలో దీప కూర్చుంటుందని సుమిత్ర, దశరథ్ ఇద్దరి మధ్యలో దీపని కూర్చొబెట్టుకొని భోజనం వడ్డీస్తారు. దశరథ్.. నీ కూతురు జ్యోత్స్నని మర్చిపోయారా అని పారిజాతం అంటుంది. దీప ఎందుకు కాకూడదని దశరథ్ అనగానే జ్యోత్స్నకి మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రేమ పంచడానికి ఎవరైతే ఏంటని దశరథ్ అంటాడు. దీపని చూసి కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరు జంటలుగా ఉన్నారు ఒక్క జ్యోత్స్న నే సింగల్ గా ఉంది.. దానికి మంచి సంబంధం చూడండి అని శివన్నారాయణతో పారిజాతం అనగానే నువ్వు నాకు చెప్పనవసరం లేదు.. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందామని శివన్నారాయణ అంటాడు.
ఆ తర్వాత అందరు భోజనం చేసాక శివన్నారాయణ తన కూతురు అల్లుడికి బట్టలు ఇస్తాడు. ఇంకా దీప, కార్తీక్ లకి కూడా ఇస్తాడు. త్వరలోనే ఇంట్లో పెద్ద పార్టీ ఇవ్వబోతున్న దానికి అందరు రావాలి.. శ్రీధర్ చిన్న కుటుంబాన్ని కూడ తీసుకొని రా అని శివన్నారాయణ చెప్తాడు. దాస్ కుటుంబాన్ని కూడానా అని పారిజాతం అనగానే.. అవును., స్వప్న, కాశీ, దాస్ అందరు రావాలని శివన్నారాయణ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.