English | Telugu

Illu illalu pillalu: అమూల్యకి ప్రపోజ్ చేసిన విశ్వ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-306 లో.. అమూల్యని గుడికి తీసుకొని వస్తుంది శ్రీవల్లి. ఇక అప్పుడే విశ్వ బండి మీద ఎంట్రీ ఇస్తాడు. ఏంటి ఇక్కడున్నావంటూ స్టార్ట్ చేస్తాడు విశ్వ కానీ అమూల్య సైలెంట్ గా ఉంటుంది. మొన్నటి వరకూ నేను మీద ప్రతీకారం తీర్చుకోవాలనే చూశాను.. కానీ ఇప్పుడు మన రెండు కుటుంబాలు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అందుకే ఆ గుడిలో ఉన్న దేవుడి సాక్షిగా నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని అనుకుంటున్నా. ఐ లవ్యూ అమూల్యా.. ఐ లవ్యూ.. అని తన మనసులో ఉన్న మాటని అమూల్యతో చెప్పేస్తాడు విశ్వ. ఏంట్రా లవ్ చేస్తున్నావా.. లవ్వూ.. ఒళ్లు ఎలా ఉందిరా.. పిచ్చి పిచ్చిగా ఉందా.. లవ్వు గివ్వు అని కూస్తే చంపేస్తానని అమూల్య అంటుంది. లేదు అమూల్య.. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని విశ్వ అంటాడు.

ఇక అదంతా విని విశ్వకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అమూల్య. ఏది ఏమైనా సరే.. అమూల్యని బుట్టలో వేసుకుని ఆ రామరాజుతో పగతీర్చుకోవాలని అనుకుంటున్నాడు విశ్వ. అయితే ఈ విషయం శ్రీవల్లికి తెలియక.. అతను నిజంగానే తన ఆడపడుచుని ప్రేమిస్తుందని సాయం చేస్తుంది. ఇక కాసేపటికి శ్రీవల్లి అద్దం ముందుకు వెళ్లి.. తనని తనే పొగిడేసుకుంటుంది. ఇక అప్పుడే చందు వచ్చి తనని వెనకాల నుండి వాటేసుకుంటాడు. ఇక శ్రీవల్లి కెవ్వుమని అంటుంది. నేనే నీ బావని.. చందుని అని చందు అనగానే.. హో అవునా‌‌.. నువ్వు అయితే ఒకే బావ అంటుంది. ఈ రోజు చాలా అందంగా ఉన్నావని చందు అనగానే.. ఏంటే ఏంటి ఇన్నిరోజులు బాలేనా అని శ్రీవల్లి అంటుంది.

మా వాళ్ళు పది లక్షలు ఇవ్వలేదని నన్ను శత్రువులా చూసావ్ కదా అని శ్రీవల్లి అనగానే.. ప్రేమగా దగ్గరికి వస్తే ఇలానే అంటావా.. నువ్వు మారవే అని చందు అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక శ్రీవల్లి మళ్ళీ అద్దం ముందుకెళ్ళి తనని తాను తిట్టుకుంటుంది. మొగుడు ప్రేమగా దగ్గరికి వస్తే ఎందుకే గెలుక్కుంటావ్.. ఇప్పుడు చూడు ఏమైందో.. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆ అవకాశం అని శ్రీవల్లి తిట్టుకుంటుంది. ఆ తర్వాత ఏఙ జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.