English | Telugu

ఆదితో సుస్సు పోయించిన శేఖర్ మాష్టర్


ఢీ డాన్స్ షోలో డాన్స్ తో సమానంగా ఆది కామెడీ కూడా పీక్స్ లో ఉంటోంది ఈ మధ్య. ఐతే ఈ షోలో శేఖర్ మాష్టర్ ఇచ్చిన ఛాలెంజ్ లో ఆది ఓడిపోయాడు. దాంతో ఆదిని బట్ట బుర్రతో షోకి రమ్మని పిలిచారు. ఐతే వైట్ హెయిర్ విగ్ పెట్టుకుని ముసలివాడు గెటప్ లో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఐతే శేఖర్ మాష్టర్ చెప్పినట్టు చేసాడు ఆది. మోకాళ్ళ మీద కూర్చుని మైథిలి దగ్గరకు, జాను దగ్గరకు పంపించి "మానవరాలా బాగున్నారా" అని మాట్లాడించాడు. తాతయ్య అక్క పిలుస్తోంది అంటూ మైథిలి హన్సిక వైపు చూపిస్తే..."నేను తాతయ్య ఐతే హన్సిక నీకు అమ్మమ్మ అవుతుంది" అన్నాడు. దానికి హన్సిక కామెడీగా ఫైర్ అయ్యింది. చంపేస్తా ఆది అంది.

మోకాళ్ళ మీద అలాగే రా...అప్పుడు నీకు ఐ లవ్ యు టూ అని చెప్తా అని ఆఫర్ ఇచ్చేసరికి "నేను మోకాళ్ళ మీద నీ వరకు రావాలంటే ఐ లవ్ యు అని నా డెడ్ బాడీకి చెప్పాల్సి ఉంటుంది" అన్నాడు ఆది. ఇక శేఖర్ మాష్టర్ ఆదిని డాగ్ పొజిషన్ లో కూర్చునేలా చేసాడు.."ఐతే ముసలి కుక్కకు ఇప్పుడు అర్జెంట్ గా సుస్సు వచ్చింది అప్పుడు కాళ్ళెత్తి ఎలా పోస్తుంది" చేసి చూపించాలంటూ శేఖర్ మాస్టర్ టాస్క్ ఇచ్చేసరికి హోస్ట్ నందు ఒక మొక్కను తెచ్చి దాన్ని వాసన చూసి దాని మీద సుస్సు పోయామని చెప్పాడు. వాళ్ళ మాటలకు ఆది షాక్ అయ్యాడు. "ముసలి కుక్క ఎం చేయాలో కూడా చూడాలనుకుంటున్నారా" అని శేఖర్ మాష్టర్ కి దణ్ణం పెట్టేసాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.