English | Telugu

ప్రేరణ ఇంట్లో విషాదం ...

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా మారుతోంది. ఎందుకంటే ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అమ్మాయిల్లో యాష్మి, ప్రేరణ, బెబక్క, సీత, విష్ణు ఇలా ఈ టీమ్ అంతా కూడా అబ్బాయిలతో ఢీ అంటే ఢీ అనే టైపు. ఐతే ఇందులో బెబక్క ఎలిమినేట్ ఐపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ప్రేరణ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్.. మహానటి అని చెప్పొచ్చు. అన్ని రకాలుగా ఎవరినీ నొప్పించని మనస్తత్వం. గేమ్స్ బాగా ఆడుతుంది. మంచి కామెడీ పీస్ కూడా. అలాంటి ప్రేరణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

ప్రేరణ భర్త శ్రీపద్‌ వాళ్ల అమ్మమ్మ కన్నుమూశారు. ఐతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆమెకు ఇంకా ఈ విషయం గురించి తెలీదు. ఐతే మరి బిగ్ బాస్ ఈ విషయం గురించి ఆమెతో ఎలా చెప్తాడు అన్న పాయింట్ ఇప్పుడు ఇంటరెస్టింగ్ గా మారింది. ఐతే బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపించేస్తాడా లేదా ఆమెకు నచ్చజెప్పి హౌస్ లో కొనసాగేలా ఛాయస్ ని ఆమెకే వదిలేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ సీజన్ లో ప్రేరణ స్ట్రాంగ్ కంటెస్టెంట్ మాత్రమే కాదు మంచి కంటెంట్ ఇస్తున్న హౌస్ మెట్ కూడా. మరి ఇలాంటి టైంలో ఆమె బయటకు వెళ్ళిపోతే ఆమె ఫ్యాన్స్ బాధపడే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ ప్రేరణ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతే మాత్రం అది షోకి తీవ్ర నిరాశే అని చెప్పొచ్చు. మరైతే బిగ్ బాస్ సముదాయించి ప్రేరణాని వెళ్లకుండా చేస్తాడా ? ప్రేరణ నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది చూడాలి.


Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.