English | Telugu

ఎంత అరిస్తే అంత లేస్తుంది...

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రతీ వారం వెరైటీ సెగ్మెంట్స్ తో ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇందులో రష్మీ పెట్టె కాన్సెప్ట్స్ కి ఎవ్వరైనా పడీపడీ నవ్వాల్సిందే. అలాంటి ఒక కాన్సెప్ట్ ని రష్మీ డిజైన్ చేసింది "అదే ఎంత అరిస్తే అంత లేస్తుంది" అంటే ఇందులో బూతేమీ లేదు. ఈ షోలో ఆది అండ్ టీమ్ తో ఈ గేమ్ ఆడించింది. ముందు ఉమాదేవిని పిలిచింది రష్మీ .. గట్టిగా అరవమని చెప్పింది. అలా ఎంత గట్టిగా అరిస్తే అంతలా ఆ స్పీకర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అదన్నమాట అసలు రష్మీ మాటకు అర్ధం. ఐతే ఉమాదేవి హాఫ్ సెంచరీ దాటేలా అరిచింది. ఆ తర్వాత వీణాని పిలిచాడు ఆది. ఒక్క గట్టి అరుపుతో 50 స్కోర్ చేసింది. దాంతో ఆది వేసిన డైలాగ్ మాములుగా లేదు. "ఒక్క అరుపుకే 50 కొట్టావంటే" అన్నాడు. దానికి సిగ్గుపడిపోయింది వీణ. తర్వాత మళ్ళీ అరిచి 80 స్కోర్ కొట్టింది. ఫైనల్ గా మహతిని పిలిచాడు.

ఇక మహతి ఐతే "ఆది హగ్ చేసుకో" అనడం రష్మీ కూడా "మహతి ఆదిని హగ్ చేసుకుని అరువు" అనేసరికి ఆది భయపడి వెళ్ళిపోయాడు. మహతి అరిచినా లెవెల్స్ పెరగలేదు. ఇక మహతి అరుస్తుందో, అడుక్కుంటుందో అర్ధం కావట్లేదని రష్మీ తలపట్టుకుంది. తర్వాత రష్మీ అరిచేసరికి 100 లెవెల్స్ వరకు వెళ్లాయి. భావనతో ఆరోపించారు అంతా ఆమె వాయిస్ లెవెల్స్ 60 వరకు వెళ్తే ఫైనల్ గా ఈ సెగ్మెంట్ క్లోజింగ్ లో ఆది వెళ్ళాడు. సింపుల్ గా ఒక దగ్గు దగ్గాడు అంతే 100 కి లేచాయి లెవెల్స్.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.