English | Telugu

యూకేలో కౌశల్ భార్య ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..!

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్.. ఇటీవల తన భార్య నీలిమ ఆరోగ్యానికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టాడు. ఆయన పోస్ట్ ను బట్టి నీలిమ ఆరోగ్య పరిస్థితి దెబ్బ తిందని అర్ధమైంది. అయితే వీటిపై క్లారిటీ ఇస్తూ నీలిమ స్వయంగా ఓ వీడియో విడుదల చేసింది. పిల్లలు, భర్తకు దూరంగా లండన్ లో ఉద్యోగం చేస్తున్న నీలిమ కోవిడ్ బారిన పడింది. అయితే లండన్ లో ట్రీట్మెంట్ సరిగ్గా చేయడం లేదని తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ వీడియో రిలీజ్ చేసింది నీలిమ.

ఇందులో ఆమె పలు విషయాలను వెల్లడించింది. తనకు కోవిడ్ వచ్చి ఏడు రోజులు అవుతోందని.. ప్రస్తుతం తను యూకేలో ఉన్నానని.. యూకే సేఫ్ కంట్రీ కదా ఇక్కడ కేసులు లేవనుకున్నానని.. కానీ తనకు వర్క్ చేసే ప్లేస్ నుండి కోవిడ్ సోకిందని చెప్పింది. ఇండియాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. అయితే అక్కడి కంటే యూకేలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని చెప్పింది నీలిమ. తనకు కోవిడ్ వచ్చిన తరువాత బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడ్డానని.. ఆ సమయంలో ఎన్ హెచ్ ఎస్ వాళ్లకు చెబితే వాళ్లు పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చి ఊరుకున్నారని.. ట్రీట్మెంట్ చేయలేదని తను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించింది.

యూకే గురించి గొప్పగా ఊహించుకున్నానని.. కానీ ఏం లేదని.. ఇండియాలో చిన్న ప్రాబ్లెమ్ ఉందని చెప్పినా .. ఎంతో బాగా స్పందిస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడిందని.. నెగెటివ్ రాగానే ఇంటికి రావాలనిపిస్తుందని చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన నీలిమ‌, "పిల్ల‌ల్ని వ‌దిలి రావ‌డ‌మంటే ఈ భూమ్మీద న‌ర‌కం లాంటింది." అంటూ ఓ పోస్ట్ పెట్టింది.