English | Telugu

న‌లుగురూ చూస్తుంటే అలా.. ఎవ‌రూ చూడ‌క‌పోతే ఇలా.. సుమ ఫన్నీ వీడియో!

యాంకర్ సుమ బుల్లితెరపై ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఆమె కోసమే షోని చూసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఎంత పెద్ద స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఉన్నప్పటికీ సుమ వేసే పంచ్ లకు నవ్వాల్సిందే. అంతగా తన కామెడీ టైమింగ్ తో మెప్పిస్తుంటుంది. ప్రస్తుతం ఈమె పలు టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. అయితే లాక్‌డౌన్ కారణంగా షూటింగులన్నీ ఆగిపోవడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సుమ కూడా ఇంట్లోనే ఉంటోంది.

అలా అని ఆమె ఖాళీగా ఏం ఉండ‌ట్లేదు. ఇంట్లో ఉన్నా తన అభిమానులకు ఎంటర్టైన్మెంట్ పంచడం ఆప‌లేదు. ఎప్పటికప్పుడు పలు ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ అందరినీ నవ్విస్తోంది. అలానే కోవిడ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ పాజిటివ్ కొటేషన్లు చెబుతూ ఆమె చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి. రీసెంట్ గా సుమను కొందరు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. లేగ దూడ మూతిని కట్టేసి హింసిస్తున్నారంటూ సుమపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.

దీంతో ఆమె దానిపై వివరణ ఇస్తూ అసలు సంగతి చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదిలా ఉండగా తాజాగా సుమ ఓ వీడియోను షేర్ చేసింది. ఇది మామిడి పండ్ల సీజన్‌ కావడంతో దానికి తగ్గట్లే సుమ వీడియో చేసింది. అందరూ ఉన్నప్పుడు మామిడి పండ్లు ఒకలా తింటాం.. ఎవరూ చూడకపోతే మరోలా తింటామని.. తను కూడా అంతేనని.. అందరూ చూస్తుంటే ఎంతో పద్ధ‌తిగా, స్టైల్ గా తింటానని.. ఎవరూ చూడకపోతే ఇలా తింటా అంటూ ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు హాయిగా నవ్వుకుంటున్నారు.