English | Telugu

Guppedantha Manasu : తండ్రిని చంపటానికి ఆవేశంతో వెళ్తున్న మను


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1160 లో.. రిషి సర్‌కి మను తండ్రి ఎవరో తెలిసినా కూడా ఎందుకు రియాక్ట్ కావడం లేదు? ఇంత సీరియస్ విషయాన్ని అంత కూల్‌గా ఎలా తీసుకుంటున్నారు? రిషి సర్ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. ఆయన నా దగ్గర ఏదో దాస్తున్నారు? అసలు అదేంటో కనిపెట్టాలని వసుధార అనుకుంటుంది. మరోవైపు మనుకి మెసేజ్‌లు పెడుతూనే ఉంటాడు మహేంద్ర. ఎందుకు మను ఫోన్ తీయడం లేదు.. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నానంటూ మహేంద్ర మెసేజ్ పెట్టగానే.. అది చూసిన మను ఫోన్‌ని విసిరికొట్టబోతుంటాడు.

అప్పుడే మనుకి అనుపమ జ్యూస్ తీసుకొని వస్తుంది. దానిని విసిరిగొట్టేసి.. ఈ ఇంటికి ఎవరైన వచ్చారా అంటు మను అడగ్గానే.. రిషి, వసుధారలు వచ్చారని చెప్తుంది. రిషికి చెప్పారా? నా తండ్రి ఎవరోనని మను అడుగుతాడు. అవును.. నేను చెప్పాల్సి వచ్చిందని అనుపమ అంటుంది. ఏం చెప్పావని మను అడిగితే.. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానమంటూ అనుపమ చెప్తుంది. ఇక ఏం చెప్పావంటు మను నిలదీయగా.. మహేంద్ర నీ కన్నతండ్రి అని చెప్పానని అనుపమ అంటుంది. మరి రిషి ఏమన్నాడని మను అడుగగా.. తనేం మాట్లాడలేదు, నేను ఆ నిజం చెప్పిన తరువాత నా మొహం వాళ్లకి చూపించలేక రూమ్‌లోకి వెళ్లిపోయానని అనుపమ అంటుంది‌.

మళ్లీ అడుగుతున్నాను.. మా నాన్న ఇక్కడికి వచ్చాడా? అని మను అడుగుతాడు. దాంతో అనుపమకి కోపం తన్నుకొస్తుంది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు.. మీ నాన్న ఇక్కడికి రాలేదు రాలేదు.. రాలేదుని అనుపమ అంటుంది.


నన్ను నిజం తెలుసుకోమంటారా అని మను అడుగుతాడు. వెళ్లి ఆయనతోనే మాట్లాడి డైరెక్ట్‌గా తెలుసుకుంటానని గన్ చూపిస్తాడు. గన్ పట్టుకుని మను ఆవేశంగా వెళ్తుంటే.. అనుపమ ఆపుతుంది.. ప్లీజ్ మను నువ్వు వెళ్లొద్దని అంటుంది. లేదమ్మా.. ఈ ఆగస్టు నెల అయిపోయేలోగా.. ఈ గన్‌లో బుల్లెట్స్ ఖాళీ అవుతాయి. ఇది మాత్రం పక్కా అని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.