English | Telugu
బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్.. వద్దని కొందరు.. కావాలని కొందరు
Updated : Aug 13, 2023
సెప్టెంబర్ 3న బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారం కావడానికి రెడీ ఐపోతోంది. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే విషయాలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ వస్తోంది. మొగలి రేకులు సీరియల్ హీరో ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, అలాగే కార్తీక దీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభా శెట్టి, జబర్దస్త్ నుంచి బులెట్ భాస్కర్, బుట్ట బొమ్మ, ఇంటింటి రామాయణం సినిమాల్లో నటించి మెప్పించిన నవ్యస్వామి, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి.. ఆమె కూతురు సుప్రియతో కలిసి వెళుతోందని టాక్ వినిపిస్తోంది. బుల్లెట్టు బండి సాంగ్ తో మస్త్ ఫేమస్ అయిన ఫోక్ సింగర్ మోహన భోగరాజు, ఋతురాగాలు సీరియల్ నటుడు ప్రభాకర్, యాంకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ దుర్గారావు కపుల్ ఈసారి బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నారనే విషయం తెలుస్తోంది.
ఇకపోతే బిగ్ బాస్ బజ్ కోసం ఈసారి గీతూ రాయల్ ఉండబోతోందట. దానికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. గీతూ రాయల్ బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా గట్టి పోటీ ఇచ్చింది. ఎలాగైనా టైటిల్ గెలుచుకుని రావాలనుకుంది. కానీ గెలుచుకోలేకపోయింది. హౌస్ లోంచి తనను పంపించొద్దంటూ ఏడ్చేసింది కూడా. అలాంటి గీతూ బిగ్ బాస్ బజ్ కి వస్తుందంటూ న్యూస్ వచ్చేసరికి నెటిజన్స్ మాములుగా కామెంట్ చేయడం లేదు. కొంతమంది "మా గీతూ అక్క బజ్ కి యాంకర్ అయింది కంగ్రాట్స్...గీతూ ఉంటే ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే" అని చెప్తుంటే కొంతమంది మాత్రం "బాబోయ్ గీతూ వద్దు" అంటున్నారు. "శివ బాగా చేస్తాడు కదా..అతనికే ఇవ్వండి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.