English | Telugu

 ఏరా.. బిజినెస్ డీల్ క్లోజ్ చేద్దామా.. ఆ ఐదెకరాల మామిడి తోట మాత్రం నాకు

సుమ ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. అలాంటి సుమ హోస్టింగ్ లోనే కాదు..బిజినెస్ డీల్స్ క్లోజ్ చేయడంలో కూడా దిట్టగా మారిపోయింది. తన ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూస్తే ఎవ్వరికైనా నవ్వు రాక మానదు. ఒక చిన్న బాబుని ఎత్తుకుని వాడితో మాట్లాడింది. వాడు మాత్రం అమాయకంగా సుమ ముఖాన్నే చూస్తూ పెదాలు చప్పరిస్తూ, నవ్వుకున్నాడు.

"బిజినెస్ డీల్ క్లోజ్ చేసుకుందామా...ఆ నాలుగు పట్టు చీరలు నీకు, కావాలంటే ఆరు పంచెలు నాకు..10 ఎకరాల కొబ్బరి తోట నీకు..ఏం మూడ్ మారింది..హలో..అలా నవ్వేసి పక్కకు వెళదామని అనుకోకు..ఇక్కడ విను..ఐదెకరాల మామిడి తోట మాత్రం నాకు..నువ్వు నీ ఫేస్ ని అలా పెట్టకూడదు..ఎందుకలా పెదాలు చప్పరిస్తున్నావ్..హలో క్లోజ్ చేద్దామా డీల్" అంటూ ఆ పిల్లాడిని చూస్తూ నవ్వేసింది సుమ.

సుమ ఏది చేసినా వెరైటీగా ఉంటుంది. రీసెంట్ గా నిద్ర పోతున్న ఒకతన్ని లేపి మరీ తన శాడిస్ట్ బుద్ది చూపించింది. ఇక ఇప్పుడు చిన్నపిల్లాడిని ఎత్తుకుని వాడితో బిజినెస్ వ్యవహారాలూ మాట్లాడేసింది. సుమ ఇటు టీవీ ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమా ఫంక్షన్లకు హోస్టింగ్ చేస్తూ ఉంటుంది. ఐతే ఈ మధ్య ఎక్కువగా సినిమా రిలీజ్ లకు ముందు మూవీ టీమ్స్ తో ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. ఎక్కడైనా సరే తన మాటలతో అందరినీ కట్టిపడేస్తుంది సుమ. తెలుగు కూడా అంతే చక్కగా మాట్లాడుతుంది. చిన్నపిల్లలతో కలిసి స్ట్రెస్ బస్టర్స్ అనే సీజన్ చేస్తోంది. అందులో పిల్లలతో మాట్లాడుతూ సుమ తన స్ట్రెస్ ని తగ్గించుకుంటూనే ఆడియన్స్ స్ట్రెస్ ని కూడా తగ్గించేస్తోంది.